జాతీయ వార్తలు

రైతుల ఖాతాల్లోకే కరువు సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయ మంత్రి పోచారం వెల్లడి అవకతవకలు జరగకుండా చర్యలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తెలంగాణకు కేంద్ర అందజేసే కరవుసాయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. బాధిత రైతుల ఖాతాల్లోకే సాయం జమ అయ్యేలా చూస్తామని గురువారం ఇక్కడ వెల్లడించారు. అలాగే రైతుల భూముల సర్వే నెంబర్ల ఆధారంగా వారికి పరిహారం అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కాగా జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి కరవుసాయం అందుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను కలిసి రాష్ట్ర కరవు సాయం గురించి చర్చించారు. అలాగే జనవరి 7న జరిగే హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం శంకుస్థాపన కార్యక్రమానికి రావలసిందిగా రాధామోహన్ సింగ్‌ను పోచారం ఆహ్వానించారు. ఈలోపే రాష్ట్రానికి పెద్ద మొత్తంలో కరవు సహాయం అందుతుందని రాధామోహన్ తనకు హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. కరవువల్ల తెలంగాణలోని 13 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీలున్నంత త్వరగా సహాయం అందజేయాలని రాధామోహన్‌ను మంత్రి కోరారు. కరవు నివేదిక పరిశీలన జరిగిన అనంతరం కేంద్ర ప్రభుత్వం అత్యధిక సహాయం చేస్తుందనే విశ్వాసం తనకున్నదని ఆయన అన్నారు. 2015-16 సంవత్సరానికి గాను తెలంగాణకు 103 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అందవలసి ఉందన్న మంత్రి ఆ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్ర మంత్రి అంగీకరించారని తెలిపారు. రాష్ట్రంలో విత్తనాభివృద్ధి సంస్థను మరింత పటిష్టం చేస్తామని ఆయన చెప్పారు. విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల ఏర్పాటు, నాణ్యమైన విత్తనాలను రైతులకు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పోచారం వెల్లడించారు. రైతులకు గతంలో ఏ ప్రభుత్వం కల్పించనన్ని రాయితీలను తమ ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. రుణ మాఫీ పథకం కింద రైతులు చెల్లించాల్సిన రుణాలను ఆయా బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన ప్రకటించారు. (చిత్రం) ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌తో చర్చిస్తున్న మంత్రి పోచారం