బిజినెస్

ఫెమా చట్టాలను ‘శ్రీని’ ఉల్లంఘించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైకోర్టుకు తెలిపిన సిబిఐ
హైదరాబాద్, డిసెంబర్ 3: జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి విదేశీ మారకద్రవ్య చట్టాలను ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ ఉల్లంఘించారని సిబిఐ గురువారం హైకోర్టుకు తెలిపింది. తనపైన కింది కోర్టులో సిబిఐ నమోదు చేసిన నేర అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ శ్రీనివాసన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసును జస్టిస్ బి శివశంకర్ రావు విచారించారు. ఈ కేసులో శ్రీనివాసన్, జగన్‌తో కుమ్మక్కై సిమెంట్ కంపెనీలకు అవసరమైన ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించారని సిబిఐ న్యాయవాది పి కేశవరావు వాదించారు. భారతి సిమెంట్స్‌లో శ్రీనివాసన్ దాదాపు 140 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదావేసింది.