జాతీయ వార్తలు

జైల్లోనే ఇంద్రాణిని ప్రశ్నిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెషన్స్ కోర్టు అనుమతి కోరిన సిబిఐ

ముంబయి, డిసెంబర్ 3: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించేందుకు సిబిఐ ఇక్కడి సెషన్స్ కోర్టును అనుమతి కోరింది. ఇంద్రాణితో పాటు ఆమె మాజీ భర్త సంజీవ్‌ఖన్నా, డ్రైవర్ శ్యాంవర్ రాయ్‌లను జైలులో ప్రశ్నించేందుకు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీ ఈ నెల 17 వరకు ఉంది. ‘ఈ ముగ్గురు నిందితుల్ని జైలులో మూడు వారాల పాటు విచారణ జరిపేందుకు అనుమతించాలని సిబిఐ స్పెషల్ ప్రాసిక్యూటర్ కవితా పాటిల్ న్యాయమూర్తిని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి హెచ్.ఎస్.మహాజన్ సిబిఐ పిటిషన్‌ను సోమవారం విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. నివేదిక ఆధారంగా నిందితులను విచారించాల్సి ఉందని తెలిపాయి. మరోపక్క కోర్టులో రికార్డు చేసిన సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన ప్రతిని ఇవ్వాలని కోరుతూ ఇంద్రాణి తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. అలాగే డ్రైవర్ రాయ్ నేరాంగీకార ప్రతిని కూడా ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్లు కూడా సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.