జాతీయ వార్తలు

జస్టిస్ సిక్రే వైదొలిగారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరారావు నియామకంపై దాఖలైన పిటిషన్‌పై విచారించే ధర్మాసనం నుంచి జస్టిస్ సిక్రే కూడా వైదొలిగారు. ఆయన కూడా సీబీఐ చీఫ్ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సభ్యుడు అయినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ సైతం ఇదే విషయమై వైదొలిగిన సంగతి తెలిసిందే. మాజీ చీఫ్ అలోక్ వర్మను అగ్నిమాపకు శాఖకు బదిలీ చేస్తూ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును ప్రధాని నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావును ఎలా నియమిస్తారంటూ కామన్ కాజ్ అనే సంస్థ పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్ విచారణ చేసే ధర్మాసనం నుంచి నిబంధనల ప్రకారం తాను వైదొలుగుతున్నట్లు జస్టిస్ సిక్రే తెలిపారు.