జాతీయ వార్తలు

సీబీఐ ఎదుట హాజరైన రాజీవ్‌కుమార్, మాజీ టీఎంసీ ఎంపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్: తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కునాల్ ఘోష్, కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ సీబీఐ ఎదుట సోమవారంనాడు హాజరయ్యారు. ఈ ఉదయం మాజీ ఎంపీ కునాల్ ఘోష్ హాజరైన గంట తరువాత రాజీవ్ కుమార్ వచ్చారు. ఇరువురిని సీబీఐ అధికారులు విచారించారు. కాగా మాజీ ఎంపీ కునాల్ ఘోష్ శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో కేసులో 2013లో అరెస్టు అయ్యారు. మూడేళ్ల తరువాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం విదితమే. కాగా శారదా కుంభకోణం కేసుపై రాజీవ్‌కుమార్‌ను విచారించటానికి వచ్చిన సీబీఐ అధికారులను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేయటం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట సత్యాగ్రహం చేయటం జరిగింది.