బిజినెస్

ఇప్పుడే రాలేను.. గడువివ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇడికి విజయ్ మాల్యా విన్నపం
6 లక్షల లావాదేవీలపై సిబిఐ గురి
ముంబయి/న్యూఢిల్లీ, మార్చి 17: బ్యాంకులకు ఉద్ధేశ్య పూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు ఏప్రిల్ వరకు గడువు ఇవ్వాలని గురువారం కోరాడు. తద్వారా ఆయన ఐడిబిఐ బ్యాంకుకు రుణాల ఎగవేత కేసులో జారీ అయిన సమన్లకు సంబంధించి ప్రస్తుతం మనీ లాండరింగ్ నిరోధక సంస్థ ఎదుట హాజరు కాలేనని తేల్చి చెప్పాడు. ఈ వ్యవహారంలో ఇంతకుముందు నిర్ధేశించిన గడువు ప్రకారం శుక్రవారం తాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాలేనని, కనుక ఏప్రిల్ వరకు గడువు ఇవ్వాలని మాల్యా తెలియజేశాడని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు అధికారులు మాల్యా పంపిన సమాధానాన్ని, ప్రస్తుతం వ్యక్తిగతంగా హాజరు కాలేకపోవడానికి ఆయన పేర్కొన్న కారణాలను పరిశీలిస్తున్నారని, ఆయనకు గడువు పొడిగించాలా? లేదా? అన్నదానిపై వారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఆ వర్గాలు వివరించాయి. ఇదిలావుంటే, బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో విజయ్ మాల్యాపై దర్యాప్తు జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రస్తుతం ఆయనకు సంబంధించిన 6 లక్షల ఆర్థిక లావాదేవీలపై దృష్టి కేంద్రీకరించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా 2013లో లైసెన్సును కోల్పోయిన కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ కోసం గతంలో బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా ఆ నిధుల్లో చాలా మొత్తాన్ని విదేశాలకు తరలించాడని, ప్రస్తుతం తాము దృష్టి సారించిన 6 లక్షల ఆర్థిక లావాదేవీల్లో ఇందుకు సంబంధించినవే 60 శాతం మేరకు ఉన్నట్లు తెలుస్తోందని సిబిఐ వర్గాలు తెలిపాయి.