రంగారెడ్డి

సిసిరోడ్డు, డ్రైనేజీ పనులకు నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, ఫిబ్రవరి 14: లింగోజిగూడ డివిజన్‌లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కేటాయిస్తానని కార్పోరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ కాలనీలో ఆయన సంక్షేమ సంఘ సభ్యులతో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.
కాలనీలో మట్టి రోడ్లు ఉండడం వలన వర్షం కురిసినప్పుడు రోడ్లపై నడవలేక పోతున్నామని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతుందని కాలనీవాసులు ఆయనకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటగా డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి సీసీరోడ్లు వేసేందుకు నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని డివిజన్‌లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వివరించారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సంక్షేమ సంఘం సభ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు క్రిష్ణ, చంద్రశేఖర్, ముఖేష్, రాము, గురువయ్య, యాదయ్య, నాగరాజు, అండాలమ్మ, లక్ష్మీ, శ్రీ్ధర్, శ్రావన్‌కుమార్, మల్లారపు శ్రీనివాస్ పాల్గొన్నారు.