బిజినెస్

పివిఆర్-డిటి సినిమాస్ ఒప్పందంపై ఏమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రజాభిప్రాయాన్ని కోరిన సిసిఐ
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: మూవీ థియేటర్స్ చైన్ పివిఆర్ రూ 500 కోట్లతో డిటి సినిమాస్‌ను కొనుగోలు చేసే ప్రతిపాదనపై ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ అయిన కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రజలనుంచి అభిప్రాయాలను కోరింది. ఈ కొనుగోలు ఒప్పందం పోటీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిన తర్వాత సిసిఐ దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. సిసిఐ ఒక ప్రధాన కొనుగోలు ఒప్పందాన్ని ప్రజాభిప్రాయానికి ఉంచడం ఏడాది కాలంలో ఇది మూడోసారి. గత ఏడాది సిసిఐ సుమారు 400 కోట్ల డాలర్ల విలువైన సన్‌ఫార్మా-రాన్‌బాక్సీ , హోలీసిమ్ లా ఫర్గే కొనుగోలు ఒప్పందాలను సైతం ఇదే విధంగా ప్రజాభిప్రాయానికి ఉంచింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, చండీగఢ్‌లలో 39 థియేటర్లు, డిఎల్‌ఎఫ్ యుటిలిటీస్ లిమిటెడ్‌కు చెందిన డిటి సినిమాస్‌ను రూ.500 కోట్లకు కొనుగోలు చేసేందుకు అనుమతించాలని పివిఆర్ గత జూలైలో సిసిఐని కోరింది.