బిజినెస్

సిమెంట్ వ్యాపారాన్ని అమ్మేస్తున్న రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: రిలయన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ తన సిమెంట్ వ్యాపారాన్ని విక్రయించడానికి జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయని, ఈ వారంలోనే దీనికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడానికి అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రా తన సిమెంట్ పరిశ్రమను విక్రయించాలని అనుకుంటోంది. దీనికి సంబంధించి ఈ సంస్థ అటు దేశీయ, ఇటు విదేశీ కొనుగోలుదారులతో చర్చలు జరుపుతోంది.ప్రారంభంలో ఆసక్తి చూపిన 15 మంది కొదుగోలుదారుల్లో ఏడుగురితో ఆ సంస్థ చర్చలు జరుపుతోందని, ఏ క్షణంలోనైనా ఒప్పందం కుదిరే అవకాశముందని కంపెనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అనిల్ అంబానీ రష్యానుంచి తిరిగి రాగానే ఈ వారంలోనే ఒప్పందం కుదరవచ్చని కూడా ఆ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ వెంట మాస్కో వెళ్లిన అనిల్ అంబానీ శుక్రవారం రాత్రి ముంబయి తిరిగి వస్తారు. ఒక వేళ వీలు కాకపోతే వచ్చేవారం ప్రారంభంలో తుది ఒప్పందంపై ప్రకటన వెలువడవచ్చని ఈ పరిణామాల గురించి మాగా తెలిసిన ఒకరు చెప్పారు. సిమెంట్ పరిశ్రమ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్న సంస్థల్లో బ్లాక్‌స్టోన్, కార్లైల్, కెకెఆర్‌లాంటి ప్రముఖ కంపెనీలున్నాయి.
సిమెంట్ ఒప్పందం 5000-6000 కోట్ల రూపాయల మధ్య ఉండవచ్చని, అప్పులు తీర్చివేసిన తర్వాత కంపెనీ వద్ద దాదాపు 50 వాతం మొత్తం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. ఏటా 55 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రిలయన్స్ సిమెంట్‌కు మధ్యప్రదేశ్‌లోని మైహర్, ఉత్తరప్రదేశ్‌లోని కుందన్‌గంజ్, మహారాష్టల్రోని బుటిబోరిలో ప్లాంట్లున్నాయి. అప్పులు తీర్చడంతో పాటుగా రక్షణ పరికరాల తయారీ రంగంలోకి అడుగుపెట్టడానికి పెట్టుబడుల కోసం రిలయన్స్ ఇన్‌ఫ్రా రోడ్ల నిర్మాణం సహా అప్రధాన రంగాల ఆస్తులను అమ్మేయాలని అదుకుంటోంది. ఇదిలా ఉండగా రష్యాకు చెందిన ప్రముఖ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థల తయారీదారు ‘అలమజ్‌అంటే’తో కలిసి రిలయన్స్ డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్టక్చర్ పని చేస్తుందని అనిల్ అంబానీ నేతృత్వంలోని ‘అడాగ్’గ్రూపు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.