రాష్ట్రీయం

కేంద్ర సాయంపై అసెంబ్లీలో వెల్లడిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు శాసససభాపక్షం సమావేశంలో నిర్ణయం

విశాఖపట్నం, మార్చి 13: విభజన అనంతరం రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం, మంజూరు చేసిన అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను అసెంబ్లీ సమావేశాల వేదికగా ప్రజలకు తెలియచేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి కె.హరిబాబు అన్నారు. ఆదివారం విశాఖలో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు కె.హరిబాబు విలేఖరులకు వివరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపేందుకు కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు పూర్తి సహకారం ఇస్తుందన్న అంశాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలపాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకూ మంజూరు చేసిన వివిధ ప్రాజెక్టుల వివరాలను కూడా సభలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి సహకారం అందేలా చూస్తామని, విభజన సమయంలో ఏర్పడిన ఆర్థిక లోటు భర్తీకి పార్టీ పరంగా ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, పెండింగ్ ప్రాజెక్టుల అమలుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని, బిల్లు ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కెజి బేసిన్‌లో హైడ్రేట్ నిల్వలు ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో వెలికితీసే సాంకేతిక పరిజానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరతామన్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఐఎస్‌బి తరహాలో విశాఖలో ఉన్నత ప్రమాణాలతో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విద్యాలయం పని చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర పెట్రోలయం శాఖ మంత్రి తెలిపారన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి, మెడికల్ డివైసెస్ మాన్యుఫాక్చరింగ్ పార్క్ ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 20 నెలల కాలంలో రాష్ట్రానికి రూ.1.4 లక్షల కోట్ల మేరకు ప్రాజెక్టులు కేంద్రం మంజూరు చేసిందని ఆయన గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్భ్రావృద్ధికి సహకరించుకుంటూ పని చేస్తున్నాయని హరిబాబు కితాబిచ్చారు.
పోలవరం బాధ్యత రాష్ట్రానిదే
పోలవరం ప్రాజెక్టుకు నిధులు తక్కువగా కేటాయించడం వాస్తవమేనని, అయితే నాబార్డు కింద రూ.1600 కోట్లు కేటాయించేందుకు కేంద్ర జలవనరులశాఖ సిద్ధంగా ఉందని హరిబాబు తెలిపారు. దీనిపై తగు చర్యలు చేపడతామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు అథారిటీ పనులను పర్యవేక్షిస్తుందని చెప్పారు.
చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న రైల్వేజోన్ ఏర్పాటుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని హరిబాబు తెలిపారు. జోన్ ఏర్పాటు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశమన్నారు. విభజన సమయంలో జోన్ ఏర్పాటుకు ఫీజబులిటీ చూడమన్నారని, నివేదిక రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చిందని గుర్తుచేశారు. అయినా రాజకీయ నిర్ణయం తీసుకుని జోన్ ప్రకటించామని, ఎన్ని సమస్యలు ఎదురైనా అధిగమించి జోన్ కళ సాకారం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చూడాలన్న ఆకాంక్ష రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిబింబించిందన్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి. మాణిక్యాలరావు పాల్గొన్నారు.