బిజినెస్

ఐఓసి డైరెక్టర్ల బోర్డులోకి ముగ్గురు స్వతంత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నియమించిన కేంద్రం
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) బోర్డులో కేంద్ర ప్రభుత్వం ప్రముఖ ఐటి సొల్యూషన్స్ సంస్థ ‘మైండ్‌ట్రీ’ సహ వ్యవస్థాపకుడు సుబ్రతో బాగ్చీ సహా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. ఐఓసి బోర్డులో యుపిఎ ప్రభుత్వ హయాంలో నియమితులైన నలుగురు డైరెక్టర్లను 18 నెలల క్రితం తొలగించిన ఎన్‌డిఎ ప్రభుత్వం తాజాగా బాగ్చీ సహా చండీగఢ్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ సంజయ్ కపూర్, అహ్మదాబాద్‌కు చెందిన ట్యాక్స్ అడ్వకేట్ పరీందు కె.్భగత్‌లను స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నియమకాలను జరిపిందని బాంబే స్టాక్ ఎక్సేంజీకి ఐఓసి తెలియజేసింది. ఐఓసి బోర్డులో ప్రస్తుతం చైర్మన్, ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లు సహా మొత్తం ఏడుగురు ఫంక్షనల్ డైరెక్టర్లు ఉన్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ ‘సెబీ’ విధించిన నియమ నిబంధనల ప్రకారం ఐఓసిలో స్వతంత్ర డైరెక్టర్లు కూడా ఏడుగురే ఉండాలి. అయితే ప్రస్తుతం ఆ సంస్థ బోర్డులో ముగ్గురు మాత్రమే స్వతంత్ర డైరెక్టర్లు ఉన్నారు.