ఆంధ్రప్రదేశ్‌

బాధితులను కేంద్రం ఆదుకుంటుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 10: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కడప జిల్లాలో అపారనష్టం జరిగిందని, దీన్ని తాము పరిశీలించామని కేంద్ర కరవు బృందం స్పష్టం చేసింది. వరద బాధితులను కేంద్రం తప్పకుండా ఆదుకుంటుందని బృందం స్పష్టం చేసింది. కేంద్ర కరవు బృందం గురువారం కడప జిల్లాలో పర్యటించింది. బృందంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ పంటలు, విత్తనాల విభాగం డైరెక్టర్ కల్వాకర్, కేంద్రగ్రామీణాభివృద్దిశాఖ డిప్యూటీ కార్యదర్శి ఎంఎస్ రేఖా చౌహాన్, గోదావరి సర్కిల్ ఉన్నతాధికారి బి.కె.రెడ్డి, ఆర్థికశాఖ డిప్యూటీ కార్యదర్శి హరిమిశ్రా ఉన్నారు. బృందం రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె మండలాల్లో పర్యటించి వరదకు తెగిపోయిన కాజ్‌వేలు, రోడ్లు, కాలువలు, చెరువులను పరిశీలించింది. రైల్వేకోడూరు ఎంపిడివో కార్యాలయంలో ఏర్పాటుచేసిన వరద దృశ్యాల చిత్రాలను పరిశీలించింది. కోడూరు రెడ్డిపల్లె మధ్య తెగిపోయిన వంతెనను పరిశీలించింది.