సెంటర్ స్పెషల్

రణక్షేత్రం 27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ ప్రయాణం ఎలా సాగాలన్నదే ఇప్పుడు సమస్య.
తప్పు చేసినట్లు తల వంచుకుని అశోక్ ఆడించినట్లు ఆడటమా?
పోరాడి, నా దారి నేను ఏర్పాటు చేసుకోవటమా?
రెండోదానే్న ఎన్నుకున్నాను నేను.
ఈ పోరాటం నా జీవిత గమనాన్ని మారుస్తుందని కాదు, అతని విజయాన్ని అడ్డుకోవాలని.
పార్టీ ప్రెసిడెంట్ ఇద్దరినీ ఒకేసారి లోపలకు పిలిచాడు. ‘రామ్మా!..రా!!’ అంటూ ఆహ్వానించాడతను.
‘నేను నా నిర్ణయం మార్చుకున్నాను సార్! నా నియోజకవర్గం నుండి నేను పోటీ చేయాలనుకుంటున్నాను...’ చెప్పాను.
‘అది నీ నియోజకవర్గం ఎలా అయింది? నాది...’ అని అరిచాడు అశోక్.
‘అది మీ ఇద్దరిదీ కాదు. ప్రజలది...’ చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్. ‘చక్కగా పని చేస్తున్న వసుంధరని కాదని ఆ సీటు నీకు ఇవ్వలేము అశోక్...’
‘అదేమిటి? నేను పోటీ చేయటం కుదరకపోవటం వలన పోయినసారి ఆమెను నిలబెట్టాం. ఇప్పుడు అలాంటి అభ్యంతరాలు లేవుగా...’
‘రిజర్వ్‌డ్ నియోజకవర్గంలో నువు నిలబడకూడదు. కానీ, జనరల్ నియోజకవర్గంలో ఆమె నిలబడటానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’
‘మీరు సీటు ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్‌గా అయినా నిలబడతాను...’ విసురుగా లేస్తూ అన్నాడు అశోక్.
‘అది నీ ఇష్టం. పార్టీ మాత్రం సీటు వసుంధరకే ఇవ్వాలని నిర్ణయించింది...’ నిస్పష్టంగా చెప్పాడతను.
‘నన్ను కాదని ఎలా గెలుస్తావో చూస్తాను..’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు అశోక్.
‘అశోక్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ ఇవాళ కాకపోతే రేపయినా బయటపడక మానవు. అందుకే పార్టీ ఎలాంటి మచ్చలేని నిన్ను సపోర్ట్ చేయాలని నిర్ణయించింది. నువు పోరాడు. నీ వెనుక మేమున్నాం...’ అన్నాడతను.
ఎవరి ప్రయత్నాల్లో వాళ్లం మునిగిపోయాం. మధ్యమధ్యలో అశోక్ చాలా రాజీ ప్రయత్నాలు చేశాడు. నేను పడనివ్వలేదు.
అతను సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించాడు.
అయినా నేను ఎన్నికల బరి నుండి తప్పుకోవటానికి అంగీకరించలేదు.
కారణం ఒక్కటే! అశోక్ ఇప్పటికీ తన చేష్టలకు పశ్చాత్తాప పడటంలేదు.
తప్పు చేయటం తన జన్మహక్కులా భావిస్తున్నాడు.
అతన్ని దెబ్బతీయాలంటే ముందు అతని అహాన్ని దెబ్బతియ్యాలి. అందుకు ఈ ఎన్నికలు మొదటి మెట్టు మాత్రమే!
తరువాత అతని ఆర్థిక మూలాలనూ, సాంఘిక హోదానూ ఒకటొకటిగా దెబ్బ తీయాలి. అతనే ఎప్పుడో చెప్పినట్లు... దెబ్బతియ్యటంలో తియ్యదనాన్ని నెమ్మది నెమ్మదిగా ఆస్వాదించాలి.
ఇవన్నీ జరగాలంటే నాకు అధికారం కావాలి.
అందుకే-
నేను ఎన్నికల్లో అశోక్‌ని ఎదుర్కోవటానికి నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం
యుద్ధం ముగిసింది.
ఆఖరి వార్తలు తెలిసేటప్పటికి అశోక్ వసుంధర మీద 17 ఓట్ల మెజారిటీతో ఉన్నాడు.
ఫలితం ఎటు వైపైనా రావచ్చు.
వసుంధర, అశోక్ ఇద్దరూ ఎన్నికల అధికారి పిలుపును అందుకుని ఫలితాలు లెక్కిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల హాలు దగ్గరకు వచ్చారు.
హాలు వరండా ఎత్తుగా ఉంది. అక్కడ నిలబడిన వారికి కింద ప్రదేశం అంతా స్పష్టంగా దూరం వరకూ కనిపిస్తోంది. వారిద్దరూ చెరొక వైపూ నిలబడి హాలు ముందు గుమిగూడిన జనం వైపు చూస్తున్నారు. ఎవరు గెలుస్తారో తెలియని తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇంకా ఎన్నికల అధికారి లోపలకు పిలవలేదు.
నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు అశోక్. ‘నువ్వు ఇంత దూరం రాగలవని ఊహించలేదు. నిన్ను ఎదగనిచ్చి పొరపాటు చేశాను. ఒకసారి నన్ను గెలవనివ్వు. బ్రతికి ఉండగానే నరకం ఎలా ఉంటుందో చూపిస్తాను...’ కసిగా అన్నాడు.
‘నా గురువు నువ్వే కదా అశోక్...’ ప్రశాంతంగా అంది వసుంధర. ‘నేను మాత్రం నువు చేసిన పొరపాటు చెయ్యను. ఇక నిన్ను పైకి లేవనివ్వను. నీ జీవిత పతనానికి ఈ రోజు మొదటిరోజు అని గుర్తు పెట్టుకో...’
‘ఇంకా గెలుస్తావని నీకు అంత నమ్మకమా?’
‘ఎన్నికల్లో గెలవటం, గెలవకపోవడం అన్నది చిన్న విషయం. నిన్ను అణచివెయ్యటానికి అధికారం అవసరం లేదు. నేను చాలు. అధికారం కూడా వస్తే నీ నాశనాన్ని మరింత త్వరగా చూడవచ్చన్నదే ఆశ!’
అశోక్ ఏదో అనబోతుంటే ఎన్నికల అధికారి బయటకు వచ్చాడు.
‘నేనేనా గెలిచింది?’ ఎన్నికల అధికారిని ఆత్రుతగా అడిగాడు అశోక్.
‘లేదు...’
ఒక్కసారిగా గాలి తీసినట్లు అయ్యాడు అశోక్. ‘అంటే.. ఈమె గెలిచిందా?’ వసుంధర వైప కసిగా చూస్తూ అన్నాడు.
‘అది కూడా కాదు..’ అన్నాడు ఎన్నికల అధికారి. అతనికి ఈ ఇద్దరు అభ్యర్థులూ తన మీద ఆధారపడి తన నిర్ణయం కోసం ఇలా ఎదురుచూడటం భలే బాగుంది. ఒకసారి నిర్ణయం వెలువడితే మళ్లీ అయిదేళ్ల దాకా ఇలాంటి ఛాన్సు రాదు. అందుకే నిర్ణయం చెప్పటంలో వీలయినంత ఆలస్యం చేస్తున్నాడు.
‘ఇద్దరూ గెలవక పోవటం ఏమిటి? ఎవరో ఒకరు గెలవాలి కదా...’ అసహనంగా అన్నాడు అశోక్.
‘ఇద్దరికీ ఓట్లు సమానంగా వచ్చాయి’
‘మరి ఇప్పుడు ఎవరు గెలిచిందీ ఎలా నిర్ణయిస్తారు?’
‘పోస్టల్ బ్యాలెట్ ఇంకా లెక్కపెట్టలేదు. మీ సమక్షంలో లెక్క పెడదామని మిమ్మల్ని పిలిపించాను’
‘పోస్టల్ ఓట్లు ఎన్ని ఉన్నాయేంటి?’
‘ఒకటి...’
‘ఒకటేనా?’
‘అవును. ఒకటే! అది మీ ముందు తెరుస్తాను. అందుకే మిమ్మల్ని లోపలకు రమ్మంది...’ అన్నాడు ఆ అధికారి లోపలకు దారి తీస్తూ.
అశోక్, వసుంధర అతని వెనుక లోపలకు నడిచారు.
బయట గూమికూడిన జనానికీ, విలేకరులకీ ఇంకా ఎంతసేపు ఈ టెన్షన్ భరించాలో అర్థం కావటంలేదు.
‘ఇద్దరికీ సమంగా ఓట్లు వచ్చాయంట. ఇంకా ఒకటే ఓటు మిగిలిందంట. అది ఎవరికి పడితే వాళ్లు గెలుస్తారంట...’ వార్త అందరి మధ్య ప్రవహిస్తోంది.
గుమిగూడిన వేల మంది ఇరు వర్గాల ఓటర్లూ ఎవరు గెలుస్తారో తెలియక అయోమయంలో ఉంటే, అంత మందిలో లక్ష్మణ్ ఒక్కడే గంతులు పెడ్తూ అరుస్తున్నాడు. ‘గెలిచేదెవరో నాకు తెలుసు...’ అని.
లక్ష్మణ్ ఆనందం ఎందుకో అతని బుర్రలో కూడా అప్పుడే వెలిగినట్లు ఉంది, గర్వంగా నవ్వాడు చంద్రం.

(అయిపోయింది)

-పుట్టగంటి గోపీకృష్ణ 94901 58002