సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనకి సమాచారం ఇవ్వగల భూపతి అతనేనని అర్థమయింది యుగంధర్‌కి. దాదాపుగా ఆరేళ్ల నుంచి కనిపించకుండా పోయిన మనిషి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు. అంతేకాకుండా అదే సమయంలో వ్యభిచార వృత్తిలో కొనసాగిన సుకాంతి గురించి భూపతికి తెలిసుంటుందా? పైన తిరుగుతున్న ఫ్యాన్ నుంచి వస్తున్న గాలి కూడా యుగంధర్ బుర్రలోని ఆలోచనల వేడిని తగ్గించలేక పోతోంది.
అప్పుడే ఓ యువకుడు లోపలికి వచ్చి నమస్కారం చేసాడు. ఆ పాతికేళ్ల యువకుడ్ని చూసి అన్నాడు యుగంధర్,
‘నేను పొరబడకపోతే మీరు రాజేష్...’
‘అవును సార్!’ చెప్పాడు రాజేష్ విస్మయంగా.
‘కూర్చోండి’
అతను కూర్చుంటున్నప్పుడే పరీక్షగా చూశాడు యుగంధర్.
‘మీరేం చేస్తుంటారు?’
‘కెనరా బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్ని...’
‘పోలీస్ కమీషనర్ గ్రీవెన్స్ సెల్‌కి కాల్ చేశారు. సిటీలో హైటెక్ వ్యభిచారం జరుగుతోందని.. దానికి సంబంధించిన సమాచారం ఇస్తానని...’
‘అవును’
‘ఈ సమాచారం మీకెలా తెలిసింది?’
‘హైటెక్ వ్యభిచారంలో రాసమణి అనే ఆమె ఉంది. ఆమెని అందులోంచి బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో సమాచారం సేకరించాను.’
యుగంధర్ నొసలు ముడివడింది.
‘ఆమె మీకేమవుతుంది?’
‘ఏమీ కాదు.. ఓ మనిషి అంతే!’
ఆ జవాబు ఊహించకపోవడంతో తెల్లబోయేడు యుగంధర్.
‘ఆ నెట్‌వర్క్‌లో చాలామంది ఆడవాళ్లు ఉండి ఉంటారు. ఒక్క రాసమణినే బయటకు తీసుకురావాలని ఎందుకనుకున్నారు?’
‘కారణం చాలా చిన్నది..’ అని ఊపిరి తీసుకున్నాడు రాజేష్. ఆ తర్వాత శ్రీ్ధర్ ఓ నెంబర్ ఇవ్వడం దగ్గర నుంచి అంతవరకూ జరిగింది వివరించేడు.
తన ముందు కూర్చున్న యువకుడి వ్యక్తిత్వం అసాధారణం అనిపించడంతో కాసేపు మాట్లాడలేదు యుగంధర్.
‘్భపతి ఎక్కడుంటాడు?’
‘దుబాయ్‌లో...’
‘దుబాయ్‌లో ఉన్న అతను ఈ నెట్‌వర్క్‌ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాడు?’
‘గంగోత్రి ద్వారా...’
‘ఈ వ్యక్తిని ఎక్కడైనా చూశారా?’ ఒక కాగితం ముందుకి నెట్టాడు యుగంధర్. అందులోని ఫొటో చూసి తల అడ్డంగా ఊపేడు రాజేష్.
‘అతనే లింగంపల్లి భూపతి’
ఆశ్చర్యంగా చూశాడతను.
‘్భపతి దుబాయ్ నుండి మీ బ్యాంక్‌లోని తన ఖాతాని ఎలా ఆపరేట్ చేస్తున్నాడు? దుబాయ్ నుంచి వచ్చిన సొమ్ము జమ అవుతోందా?’
‘లేదు. రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ అవుతోంది’
‘అంటే భూపతి ఇక్కడే ఉన్నాడు. తను బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు..’ అని, రెండు క్షణాలు ఆలోచించి తిరిగి అన్నాడు, ‘మీ బ్యాంక్‌లో అతనికి అకౌంట్ ఉంది కాబట్టి చెక్‌బుక్ అయిపోయాక కొత్తదాని కోసం ఇచ్చిన రిక్వెస్ట్ ఫాం మీద సంతకాన్ని వెరిఫై చెయ్యండి. ఇప్పుడు చెక్‌బుక్ కొరియల్‌లో పంపుతున్నారు కాబట్టి ఏ చిరునామాకి వెళ్లిందో తెలుసుకోండి. అకౌంట్ ప్రారంభించినప్పుడు భూపతిని బ్యాంక్‌కి ఇంట్రడ్యూస్ చేసిన వారి చిరునామాలు సంపాదించండి. అలాగే, అకౌంట్‌కి సంబంధించిన ఆరు నెలల స్టేట్‌మెంట్ కావాలి. చెయ్యగలరా?’
‘చెయ్యగలను’ చెప్పాడు రాజేష్.
‘రేపు ఉదయం రుషికొండ బీచ్‌లోని మామిడి తోటకి వెళ్లి వివేక్ హత్య జరిగిందో లేదో తెలుసుకుంటాను. హత్య జరగడం నిజమైతే మరో ముఖ్యమైన పని చెయ్యాలి’
‘ఏమిటది?’
‘రాసమణి స్టేట్‌మెంట్ అవసరమవుతుంది’
‘అలాగే’
‘రేపు బ్యాంక్ నుంచి సమాచారం తీసుకున్నాక ఓ వారం సెలవు పెట్టండి. ఈ పద్మవ్యూహాన్ని ఛేదిద్దాం’
తలూపేడు రాజేష్.
16
‘రాసమణి ఆచూకీ తెలియలేదు. సెల్ స్విచ్ ఆపేసింది’ చెప్పాడు షరీఫ్.
‘చెప్పా చెయ్యకుండా ఎక్కడ కెళుతుంది? అపార్ట్‌మెంట్ అంతా వెదికావా? టాయిలెట్‌లోను మంచం కింద చూశావా?’ అడిగేడు గంగోత్రి.
‘నాకా ఆలోచన రాలేదు...’
‘రాత్రి తొమ్మిది నుండి ఉదయం ఆరులోపు బయటకు వెళ్లి ఉండాలి. ఎందుకంటే, మిగతా సమయంలో రమణిమాల ఆమెతో ఉంది. వాచ్‌మాన్‌కి తెలియకుండా ఆటో ఎక్కకుండా ఎలా వెళ్లగలిగింది? ముందు నువ్వు అపార్ట్‌మెంట్ మొత్తం వెదికి నాకు కాల్ చెయ్యి’
షరీఫ్ వెంటనే లాసన్స్‌బే లోని అపార్ట్‌మెంట్ చేరుకున్నాడు.
‘వచ్చిందా?’ తలుపు తీసిన రమణిమాలని అడిగేడు.
‘లేదు’
అతను లోపలికి వెళ్లి మంచాల కింద టాయిలెట్‌లోను చూశాడు. అక్కడ నుంచే కాల్ చేశాడు. షరీఫ్ చెప్పింది విని రెండు క్షణాలు ఆలోచించి అడిగాడు గంగోత్రి.
‘కొంతకాలం క్రితం రాత్రిపూట ఓ యువకుడ్ని బెదిరించావు గుర్తుందా?’
‘ఉంది’
‘అతను కెనరా బ్యాంక్‌లో పని చేస్తున్నాడు. ఎలాంటి అనుమానం కలగకుండా అతన్ని అనుసరించి ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకో. నా అంచనా నిజమైతే రాసమణి అక్కడ ఉంటుంది’
‘రామ్‌నగర్ ఏరియాలో అతన్ని అడ్డగించాం. అక్కడ కనుక్కుంటే ఎడ్రస్సు తెలుస్తుంది కదా!’ షరీఫ్ అన్నాడు.
‘పగటిపూట ఎంక్వయిరీకి బయలుదేరితే అందరికీ తెలుస్తుంది. ఏ మాత్రం తేడా వచ్చినా పిట్ట ఎగిరిపోతుంది. నువ్వు ట్రాన్సక్షన్ కోసం కెనరా బ్యాంక్‌కి వెళుతుంటావు. అలా వెళ్లినప్పుడు ఎకౌంట్ నెంబర్ ద్వారా నా చిరునామా తెలుసుకున్నాడు. అంటే నీ ముఖం అతనికి తెలిసి ఉంటుంది. అందుచేత అతన్ని అనుసరించే పని ఎవరికైనా అప్పగించు...’
‘అలాగే..’
అక్కడ నుంచి కదలబోతుండగా అతని దృష్టి రమణిమాల మీద పడింది.
ఆమెని సమీపించాడు.
* * *
బీచ్‌లోని జీడి మామిడి తోట దగ్గర ఆగింది పోలీసు జీప్.
యుగంధర్‌తోపాటు నలుగురు సిబ్బంది దిగేరు. అంతా ఆ తోటలోకి నడిచారు. చెట్లని చూస్తూ కొమ్మ నేల మీదకి వంగిన చెట్టు దగ్గరకి నడిచాడు యుగంధర్. నేలంతా ఇసుక, ఎర్రమట్టి కలిసి ఉంది. రాజేష్ చెప్పినట్టుగానే ఆ మట్టిలో గుర్తులు కనిపిస్తున్నాయి. ఆ గుర్తుల్ని అనుసరించారు. లోపల ఓ పాతిక గజాలు వెళ్లాక చిన్న దిబ్బలాంటి చోటు ఎదురైంది. ఆ దిబ్బ మీద ఈ మధ్యనే మట్టి పోసినట్టుగా ఉంది. తలెత్తి చూస్తే పచ్చటి చెట్ల కొమ్మలు ఆకులతో సహా మాడిపోయి కనిపించాయి.
‘పార తెచ్చారా?’ అడిగేడు యుగంధర్.
‘జీపులో ఉంది సార్. తెస్తాను...’ చెప్పి వెళ్లాడు కానిస్టేబుల్.
అప్పుడే బైక్ మీద వచ్చిన ఓ జంట జీపుని గమనించి ఆగకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. సమీపంలో యూనివర్సిటీ ఉండటంతో ఆ ప్రదేశానికి గిరాకీ ఎక్కువ. మనసులో అనుకున్నాడు యుగంధర్.
గునపం, పార రెండూ తెచ్చాడు కానిస్టేబుల్. మట్టి మెత్తగా ఉండటంతో గునపం ఉపయోగించాల్సిన పని లేకుండా పోయింది. రెండడుగుల లోతు తవ్వేక మరో కానిస్టేబుల్ పార అందుకున్నాడు. ఇంకో అడుగు తవ్విన తర్వాత గట్టి వస్తువు ఒకటి పారకి తగిలింది.
‘జాగ్రత్త.. మట్టి చేత్తో తియ్యండి’ చెప్పాడు యుగంధర్.
మట్టి తొలగించి మోటార్‌సైకిల్ పెట్రోల్ టేంక్ గట్టు మీద పెట్టాడు కానిస్టేబుల్. అందరూ ఆ గోతిలోకి తమ దృష్టిని సారించేరు. ఒక్కో భాగం సగం కాలిన కర్రలతోపాటు పైకి చేరింది. చివరగా ఓ మనిషి ఆకారం దర్శనమిచ్చింది.
తల మీద వెంట్రుకలు, బట్టలు కాలిపోయాయి. భూమి అడుగున మంట పెట్టడంవల్ల గాలి తగలక శరీరం పూర్తిగా కాలలేదు. లోపల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించలేక పైకి వచ్చాడు కానిస్టేబుల్. ఆ శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టమ్‌కి పంపడమంటే అంత తేలికైన పనికాదు. ఆ గోతిని రెట్టింపు వెడల్పు చేసి స్ట్రెక్చర్ మీద పైకి తేవాలి.
కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి కావాల్సిన వస్తువులతోపాటు నలుగురు కూలీలని పంపమని చెప్పాడు యుగంధర్. ఓ కానిస్టేబుల్ మోటార్ సైకిల్ విడిభాగాల నుండి భాసిస్ నెంబర్, ఇంజన్ నెంబర్ సేకరించే పనిలో మునిగిపోయాడు.
* * *
బ్యాంక్ చేరుకున్నాడు రాజేష్.
సిబ్బంది ఒక్కొక్కరు వస్తున్నారు. కౌంటర్స్ శుభ్రం చేస్తున్నారు ఇద్దరు ఆడవాళ్లు. ఇంకా మేనేజర్ రాకపోవడంతో సిస్టం ముందు కూర్చున్నాడు రాజేష్. భూపతికి మొత్తం నాలుగుసార్లు చెక్కుబుక్కులు పంపారు. అవన్నీ కూడా సాగర్‌నగర్ చిరునామాకి వెళ్లాయి. ఆ తర్వాత భూపతి ఎకౌంట్‌కి సంబంధించి ఆరు నెలల స్టేట్‌మెంట్ తీసుకున్నాడు.
రికార్డు రూములోకి వెళ్లి వెతికి ఓ ఫైలు తీశాడు. అందులోని ఎకౌంట్ హోల్డర్స్ అప్లికేషన్స్ నుంచి భూపతి, అప్లికేషన్‌లోని ఇంట్రడ్యూసర్స్ ఖాతా నెంబర్లు, చిరునామాలు రాసుకున్నాడు. అప్లికేషన్ తిరిగి ఫైల్లో ఉంచబోతూ ఓ క్షణం ఆగాడు. అతని దృష్టి అందులో అంటించిన కలర్ ఫొటో మీద నిలిచింది. ఆ తర్వాత దాన్ని యధాస్థానంలో ఉంచేశాడు.
మేనేజర్ వచ్చాక అతని ఛాంబర్‌లోకి వెళ్లి వారం రోజులు సెలవు తీసుకుని బయటకొచ్చాడు. బైక్ లాక్ తీసి వెనక్కి తిప్పి ఎక్కి కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే షరీఫ్ డొక్కు స్కూటర్ చప్పుడు చేసుకుంటూ పార్కింగ్ ప్లేస్‌కి అవతల పక్క ఆగింది. అదేమీ గమనించని రాజేష్ బైక్‌ని కంట్రోల్ రూము వైపు పోనిచ్చాడు.
ఓ మనిషితో బ్యాంక్‌లోకి ప్రవేశించాడు షరీఫ్.
‘రాజేష్‌గారు ఉన్నారా?’ మెసెంజర్ని అడిగాడు.
‘ఇప్పుడే బయటకు వెళ్లారు..’ చెప్పాడతను, రాజేష్ సెలవు తీసుకున్నాడని తెలియకపోవడంతో.
‘ఆయన సీటెక్కడ?’
చూపించాడు మెసెంజర్.
ఇవతలికి వచ్చాక తనతో ఉన్న మనిషికి చెప్పాడు.
‘ఆ సీటులో కూర్చుని పని చేసుకునే వ్యక్తిని గమనించాలి. సాయంకాలం వరకూ అతను బయటకు వెళ్లకపోవచ్చు. అతని చిరునామా తెలుసుకోవాలి...’
ఆ మనిషిని అక్కడ వదిలి బయలుదేరాడు షరీఫ్. రాజేష్ లీవు తీసుకోవడంతో అతని సీటుకి మరో వ్యక్తిని పంపాడు మేనేజర్. అతనే కావాల్సిన వ్యక్తి అనుకుని సీరియస్ వాచ్ చెయ్యసాగేడు ఆ మనిషి.
కంట్రోలు రూమ్‌కి కాస్త దూరంలో ఉండగా రాజేష్ సెల్ మోగింది. బైక్ రోడ్డు పక్క ఆపి కాల్ రిసీవ్ చేసుకున్నాడు.
‘వివేక్ బాడీ దొరికింది’ చెప్పాడు యుగంధర్.
‘నేను బ్యాంక్ నుంచి సమాచారం తీసుకుని కంట్రోల్ రూమ్‌కి వస్తున్నాను’ అన్నాడు రాజేష్.
‘రాసమణితో అవసరం పడింది’
‘ఎప్పుడు తీసుకురమ్మంటారు?’
‘ఓ గంటలో ఇక్కడ నుంచి బయలుదేరతాను. ఆ సమయానికి తీసుకొస్తే మనం వేగంగా మూవ్ కావచ్చు’
‘అలాగే...’ చెప్పాడు రాజేష్.
అక్కడ నుంచి బైక్‌ని రామ్‌నగర్ పోనిచ్చాడు. పది నిమిషాల్లో తన రూము చేరుకుని తాళం తీసి లోపలికి వెళ్లాడు. ఓ పక్క మంచం మీద కూతురుతోసహా పడుకున్న రాసమణి లేచి కూర్చుంది.
‘మనం క్రైం బ్రాంచ్‌కి వెళ్లాలి..’ చెప్పాడు రాజేష్.
‘దేనికి?’ భయంగా అడిగింది రాసమణి.
‘వివేక్ డెడ్‌బాడీ జీడిమామిడి తోటలో దొరికిందట. నీ స్టేట్‌మెంట్ కావాలన్నాడు యుగంధర్’
‘రమణిమాల ఎలా ఉంది? ఫోన్ చేసారా?’
‘మాట్లాడాను. పది గంటల తర్వాత షరీఫ్‌కి ఫోన్ చేసిందట. అతను వచ్చి వివరాలు అడిగి గంగోత్రికి ఫోన్ చేశాడట. నిన్ను వెతకడానికి మనుషుల్ని పంపాడట. ఈ రోజు ఉదయం వచ్చి అపార్ట్‌మెంట్ మొత్తం వెతికాడట. గంగోత్రితో మాట్లాడుతూ ‘వాడు రామ్‌నగర్ ఏరియాలో తగిలాడు’ అన్నాడట షరీఫ్. ‘అంటే ఇప్పుడు నా కోసం వేట మొదలెట్టారు. రమణిమాల మీద ఎలాంటి అనుమానం రాలేదట...’ చెప్పాడు.
‘అది మొండిది కాబట్టే నన్ను బయటకు తీసుకొచ్చి మీతో పంపగలిగింది. నాకైతే అంత ధైర్యం లేదు’ చెప్పింది రాసమణి.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994