సెంటర్ స్పెషల్

మహావిజేత 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి కళ్లల్లోని అభ్యర్థనే ఆమెకు కన్నుల్ని చెమరింపజేసింది. ఉద్విగ్నతని కనపడనీయకుండా ‘అవశ్యం నాన్నగారూ. మీ ఆజ్ఞ ప్రకారం నడచుకుంటాను’ అన్నది.
తర్వాత కొద్దిసేపు రాజ్య పరిస్థితులు తెలియజేశాడు. ‘ఇప్పుడు మన సామంత రాజ్యం కళింద్ర మహామండలం మరింత విస్తరించింది. కరద మండలాన్ని జయించి తెచ్చాడొక వీరుడు. చంద్రహాసుడట. ఈ పరిణామం వలన పాలనాపరమైన కొన్ని కొత్త నిర్ణయాలు అవసరం కావచ్చు. గాలవుల వారి సూచనలూ, సంప్రతింపులే నీకు అంతిమ నిర్ణయంలో సహకరిస్తాయి తల్లీ. జాగ్రత్త!’ అన్నాడు. ఆమె తలాడించింది.
ఔషధాన్ని సేవించి కళ్లు మూసుకున్నాడు.
కొంతసేపటి తర్వాత చంపకమాలినీ, వసుంధరా మందిరాన్ని వీడి వెళ్లిపోయారు.
23
ఆ రోజు - గాలవులు చంపకమాలినికి శాస్త్ర విషయాల బోధన చేస్తూండగా
నిబంధనని చేర్పించండి. ఆక్కడే ఇంకొక విషయమూ రూఢి చేయండి. ఈ నిబంధన ఈ సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని నిష్కర్షగా ప్రస్తావించండి. బాగుంది కదా! తర్వాత సంగతి తర్వాత చూద్దాం’
‘అలాగే’ అని తల ఊపాడు దుష్టబుద్ధి.
‘బాగుంది’ అన్నది చంపకమాలిని.
సెలవు తీసుకుని వెళ్లాడు దుష్టబుద్ధి.
‘రాకుమారి ఆలోచనలు నిశితంగానే సాగుతున్నై. శుభం’ అన్నారు గాలవులు. ‘చిత్తం, అంతా తమ ఉపదేశ ప్రభావం’ సన్నగా నవ్వుతూ లేచింది. ‘సెలవు’ అంటూ నమస్కరించి నిష్క్రమించింది చంపకమాలిని.
‘ఈ అందాల బొమ్మను ఏ అయ్య చేతిలో పెట్టాలో’ అనుకుని నవ్వుకున్నారాయన. సోరణగండ్ల నుండీ చంద్రహాసం ఆ-దేశికుని పలుకరిస్తోంది!
24
మనసులో చాలా పెద్ద సమస్యతో సంకుల సమరం చేస్తున్నాడు దుష్టబుద్ధి.
తన జీవితంలో ఇది ఎన్నడూ ఊహించని పరిణామం. చంద్రహాసుడు ఏనాడో విగతజీవుడైనాడని ఇనే్నండ్లు నిశ్చింతగా నిద్రపోయాడు. అసామాన్యమైన మహర్జాతకంతో, రాజయోగంతో తన కంట పడిన వాని పీడ విరగడ చేసుకున్నానన్న తృప్తితో మనుగడ సాగించాడు తాను. భావికుంతల మహాసామ్రాజ్య అవిచ్ఛిన్నాధిపత్యానికి దుర్గమమైన స్వేచ్ఛా పరిధిని నిర్మించుకున్నాడు. తన పుత్రుడు మదనునీ, అగ్నివర్మ ఏకైక కుమార్తె చంపకమాలినినీ - భావికుంతల మహారాజ దంపతులుగా ఆశా స్వప్నాలను కన్నాడు. కానీ-
ఆ చంద్రహాసుడు-
ఈనాడు ఒక ప్రశ్నార్థకంగా, ఒక భయదమూర్తిగా కళ్ల ముందు కనిపిస్తున్నాడు. తమ పక్కలో బల్లెంలా నిలిచి, కుచ్చెలలో సర్పంలాజొచ్చి, ఒక సామంతుని దత్తపుత్రుడుగా మాన్యత గడించుకున్నాడు. శౌర్య సాహస పరాక్రమాల్ని సాధించటమే కాక, వాటి నైపుణినీ అసమానంగా ప్రదర్శించి విజయ ఫలాన్ని చేతికందించి చూపాడు. తమ ఆధిపత్యానికి సమ్మెటపోటు ఇది. ‘్ఛ’ అని తలవిదిలించుకున్నాడాయన. దైన్యం ఆవహించి శరీరం స్వేదజల పూరమైపోయింది. రోష క్రోధాలు కళ్లల్లో నిప్పుకణికల్ని రాలుస్తున్నాయి. ఏదో దుష్టశక్తి పగబట్టి శాసిస్తున్నట్టున్నది. కాకపోతే - ఏమి ఈ వైపరీత్యం? ఏమిటీ పరిణామం? అనిపించింది.
ఆనాడు-
ఆరేండ్ల వాడుగా, అనాధ బాలుడుగా కుంతలపురిలోని అన్నసత్రంలో తన దగ్గరకు వచ్చాడు. తీసుకొచ్చిన బ్రాహ్మణుడు జ్యోతిష పండితుడు. ఆయనే తనకు, ఆ పిల్లవాడు అపూర్వమైన జాతకుడు అనీ మసా సామ్రాజ్యాన్ని ఏలుతాడనీ చెప్పాడు. అతని ఎడమ పాదానికి ఆరవ వేలు ఉండటం కూడా విశేషంగా అతనిని గొప్పవాడిని చేస్తుందనీ వివరించాడు.
ఆ సమయంలో అగ్నివర్మ దగ్గరే తాను ఉండటం తటస్థించింది. ఇంకొక వ్యవహారాన్ని చర్చించుతూ వుండటం వలన బ్రాహ్మణుడు చెప్పిన విషయాలను ఆయన అంతగా పట్టించుకోలేదు. అది తనకు కలిసి వచ్చింది.
తాను ఇద్దరు కటిక వాళ్లను పిలిచి ‘బాలుని చంపి ఆనవాలు తెమ్మ’ని చెప్పి పంపాడు. వాళ్లు అంటువేలును తెచ్చి చూపడం, తాను నమ్మి సంతృప్తిపడటం జరిగింది. తరువాత, రాజుగారు పిల్లవాని ప్రస్తావన తెచ్చినప్పుడు, ‘వాడు అరిష్ట జాతకుడట. వాడి వలన మన రాజ్యానికే ముప్పు వస్తుందని తెలిసి దూరంగా తరిమివేయించానని చెప్పాడు.
‘చంద్రహాసుని సంహరించి రమ్మంటే, కటికవాండ్రు తన కన్నుగప్పి, నమ్మబలికి వానిని వదిలివేయటమా? వాడు నేడీ స్థితికి చేరటమా?’
ఆలోచనల సుడిలో మునుగీత లీదుతూ మందిరమంతా కలియ దిరుగుతున్నాడు దుష్టబుద్ధి. ప్రసేనుడు వచ్చాడన్న వార్త వచ్చింది. రమ్మన్నాడు. వచ్చి కూర్చున్నాడు ప్రసేనుడు.
మధువు, మధురసాలూ వేర్వేరు పాత్రలలో వచ్చాయి. ఇరువురూ తీసుకొని సేవించటం మొదలుపెట్టారు.
‘ప్రసేనా! చంద్రహాసుని విషయంలో మనం ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది. నీ అభిప్రాయం చెప్పు’ అడిగాడు దుష్టబుద్ధి.
‘మహామాత్యులకి ఉపాయాలు చెప్పేటంతటి వాడినా నేను? మీరు అడిగారు కనుక మనవి చేస్తున్నాను. కుళిందకునికి - చంద్రహాసునిపైగల ప్రేమకూ, విశ్వాసానికీ విఘాతం కలిగించాలి’
ఓరకంట నిశితంగా చూస్తూ, ‘దానికి మార్గం?’ అన్నాడు దుష్టబుద్ధి.
‘తమరే పూనుకోవాలి. వ్యూహం తమది. ఆచరణ మాది’
‘కష్టమైన కార్యమే. చూద్దాం’ అని వౌనం వహించాడు - దుష్టబుద్ధి.
తరువాత రకరకాలుగా వ్యూహాలను ఆలోచించారు. ఆచరణ సాధ్యమయిన వాటిని నిర్ణయించుకోలేక సతమతమైనారు. తర్వాత నిర్ణయించవచ్చుననుకొని లేచారు ఇద్దరూ.
25
దుష్టబుద్ధికి చంద్రహాసుడి వ్యవహారం కంటిలోని నలుసులా తయారైంది.
కరద మండలం ఆదాయ వ్యయాల వివరాలను తెలుసుకుని రమ్మని ఆర్థిక శాఖాధికారుల్ని కళింద్రకు పంపించాడు. ఆర్థికంగా దెబ్బతీయగలిగితే కుళిందకుడు తనవైపు చూస్తాడనే పన్నాగం ఆయనది. ఆ పన్నాగం విజయవంతమయితే - కరద మండలాన్ని జయించి తన మహా మండలంలో విలీనం చేసుకున్న చర్య అనాలోచితమైనదనే గ్రహింపూ పశ్చాత్తాపమూ కలిగి, కుళిందకుడు తాను చెప్పిన దారికి వస్తాడని దుష్టబుద్ధి ఊహ. ఈ ప్రణాళిక ఫలిస్తే - కరద విజయం - లాభం కంటే ఎక్కువగా నష్టమే కలిగించిందనే జ్ఞానోదయం వలన కుళిందకుడికి చంద్రహాసుని పట్ల నమ్మకం సన్నగిల్లుతుంది. ఆ విధంగా వారిరువురి మధ్యనున్న సంబంధ బాంధవ్యాలలో సన్నని బీటను చేయవచ్చు. ఇది తొలి యత్నంగా భావించాడు.
కార్తెలు గడుస్తున్నై. మాసాలు మారుతున్నై.
ఆరేడు మాసాలు గడిచి ఆర్థిక సంవత్సరం ముగియనున్న సమయంలో దక్షణ్ణకి సహకరించడానికి స్వయంగా చంద్రహాసుడే అక్షయునితో కలసి కరదలో కూర్చుని పాలనాపరమైన వివిధ సంస్కరణలను అమలు చేయించసాగాడు.
వీటిలో ప్రముఖమైనది - గిరిజనుల పాడిపంటల ఫలసాయాన్ని మెరుగుపరచడం. మొక్కలను నాటి, వృక్షాలను పెంచీ వాటి సంబంధమైన ఫల కుసుమాల ఉత్పత్తీ, పుట్టతేనె, ఔషధీయ వస్తు సంబారాల తయారీ వంటి రాబడినిచ్చే అంశాల పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. ప్రజలంతా సంతోషించి నూతన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం స్వచ్ఛందంగా అందుతున్నది. దీనితో వారి ఆర్థిక పరిస్థితి మెరుగయింది. రాజ్యానికి రావలసిన షడ్భాగము, పన్నులు, అనుపులు - వలసినంతగా వచ్చినై. వీరశివుని పాలన నాటికన్నా మెరుగయిన బ్రతుకులను సుఖ సంతోషాలతో గడుపుతున్నారు ప్రజలు.
కుంతల అధికారులకు ఈ వివరాలన్నింటినీ తెలియజేశారు కళింద్ర అధికారులు. ఇదంతా చంద్రహాస -అక్షయుల ఆలోచనలతో, నైపుణ్యంతో, శ్రమతో, పథకాల ఆచరణతో సాధ్యమైందనే వాస్తవంగా కుళిందకునికీ ఇతర ప్రముఖులకూ తెలుసు! వారు ఎంతో ఆనందించారు.
కరద ఆదాయంలో నాల్గవ పాలును ‘శాశ్వతం’గా కుంతల వారికి అందించేందుకు - కప్పం ఒప్పందానికి స్వచ్ఛందంగా ప్రతిపాదననిచ్చాడు కుళిందకుడు. ఆ ప్రతిపాదన సంగతి గాలవులకు, చంపకమాలినికి తెలియజేశాడు.
మహారాజుకు చేరిన ప్రతిపాదన - సహజంగానే దుష్టబుద్ధికి అందజేయబడింది. నిప్పుల్లో ఉప్పు పోసినట్లయింది. పెటపెట లాడిందాయన మనస్సు. కళింద్ర వారి ‘అడగక ఇచ్చిన’ విధేయతా సంపద వలన తన వ్యూహం బెడిసికొట్టిందని చిరచిరలాడాడు. ఈ వ్యవహారమంతా మడమశూలలా బాధించసాగింది!
మందిరంలోకి ప్రవేశించాడు దుష్టబుద్ధి.
ఆయన చేతిలో దస్త్రం. వచ్చి నమస్కరించి అలతి దూరంలో
కూర్చున్నాడు.
‘కళింద్ర ఒప్పంద పత్రాలు’ అంటూ దుష్టబుద్ధి వాటిని అందించాడు.
వాటిని తీసుకుంటూ దుష్టబుద్ధిని పరీక్షగా చూశారు గాలవులు. అతని ముఖం చాలా అప్రసన్నంగా ఉంది. పత్రాల విషయంలో గాలవుల వారి జోక్యం అతనికే మాత్రమూ నచ్చలేదు. కాదనడానికి లేకుండా అగ్నివర్మ అన్ని విషయాలూ ఆయనతోనే చర్చించాలంటాడు. అది మింగుడు పడదు దుష్టబుద్ధికి.
పత్రాలన్నీ పరిశీలించారు గాలవులు. చంపకమాలినికి ఇచ్చారు. ఆమె కూడా త్వరత్వరగా వాటిని పఠించింది. పఠనం పూర్తి చేసేసరికి ఆమె ముఖం ముడుచుకుంది. పత్రాలలోని ఏదో అంశం ఆమెకు నచ్చలేదని అర్థమైంది గాలవులకు. ‘బాగుంది. మహామంత్రీ. ఈ వ్యవహారంలో కీలకమైన అంశం ఏమిటంటారు?’ ప్రశ్నించారు ఆయన.
దుష్టబుద్ధి వెంటనే సమాధానం చెప్పలేదు. ఇద్దరినీ చూస్తూ కూర్చున్నాడు. ‘నువ్వు చెప్పమ్మా’ అన్నారు గాలవులు ఆత్మీయంగా.
చంపకమాలిని బెరుకుదనంతో కూడిన ఉత్సుకతతో చూస్తూ, ‘కుంతలకు ఉచితంగా మరో మండలం అందింది. ఆ మండలంలో ఇంతకు పూర్వం అశాంతీ, ఆందోళనా ఎక్కువ. ప్రజలు ఇక్కట్లతో బాధపడుతున్నారు. మరి, అక్కడి నుండీ కళింద్రకు వెంటనే ఆదాయం అంత ఎక్కువగా ఏమీ ఉండదని నా భావన’
మధ్యలో అడ్డు వస్తూ, దుష్టబుద్ధి ‘కానీ, రాకుమారీ, ఒక విషయం మీరు గుర్తించాలి. పరిస్థితులెలా ఉన్నా కళింద్ర వారికి ఎంతో కొంత ఆదాయం అందుతుంది. పరిపాలనలోని ఆర్థికాంశాలలో కట్టుబాట్లు ఉంటాయి కదా!’ అన్నాడు. ‘అవును. మీ అభిప్రాయమూ సరియైనదే. కానీ, కరద నుండీ రాగల వాస్తవాదాయం సంగతి తెలియకుండా, గణాంకాల జోలికి పోకుండా - కళింద్ర వారి నుండి మనకు ఇప్పుడు వస్తున్న భాగదేయాన్ని ద్విగుణం చేయటం భావ్యమా?’ అని సూటిగా ప్రశ్నించింది.
కొద్దిసేపు నిశ్శబ్దం అలముకుంది.
ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ స్వగతంలాగా, ‘గురువుగారు వివరించిన కోటి గ్రంథసారం అన్న భావంలోని ‘పరపీడనమ్’ అంటే ఇదే అవుతుందేమోనని నా భయం’ అన్నది. గాలవుల వారి ముఖంలో సంతృప్తి కదిలింది. దుష్టబుద్ధి వదనంలో అసహనం పెరిగింది.
‘సరి... మహామాత్యా, ఒక పని చేయించండి. ఈ ఒప్పందంలో మన భాగదేయపు నిబంధనని సవరణలు చేయించండి. ఈ సంవత్సరం కళింద్రకు కరద నుండీ రాబోయే ఆదాయంలో పావు వంతు కుంతలకు చెల్లించే విధంగా

26
కళింద్ర రాజధాని చందనావతి, మహారాజు సమావేశమందిరం. ముఖ్యులంతా కూర్చుని వున్నారు. వారిలో నిర్మాణ శాఖకు చెందిన సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు.
చంద్రహాసుడు తనకుగా వచ్చిన ఆలోచనలేమైనా ఉంటే, ముందు ఆ ప్రతిపాదనలను సంబంధిత శాఖాధికారులకూ ఆ తర్వాత - ఆచార్యులకూ, అడివప్పకూ, సైన్యాధిపతికీ వివరిస్తాడు. వారి చర్చలు అయిన తర్వాత వారి సలహాలూ సూచనలతో తుది నిర్ణయానికి అవి ప్రభువు వద్దకు చేరుతాయి. ఈ ప్రక్రియ ప్రకారమే ఇప్పుడీ ప్రధాన ప్రతిపాదన కూడా రూపుదాల్చింది.
‘చెప్పండి. ఎవరిదీ ప్రతిపాదన? ఎందుకు వచ్చింది? కారణాలతో సహా వివరించండి’ అన్నాడు ప్రభువు.
అందరూ చంద్రహాసుని వైపు చూశారు.
చంద్రహాసుడు చెప్పసాగాడు. ‘ప్రభూ! ఆనాడు కరద మండలం మీదికి దండు వెడలినప్పుడు, మన కోట ప్రాకారం దాటుతుంటే గమనించిన విషయం ఇది. కోట దుర్భేద్యమయిన గండశిలలతో నిర్మింపబడినదే అయినా అక్కడక్కడా కోట గోడలు బీటలు వారి వున్నాయి. కళింద్రపై కనె్నత్తి చూసే ధైర్యం ఎవ్వరికీ లేకున్నా, మన నిర్మాణాన్ని మనం సక్రమంగా సంరక్షించుకోవలసిన ఆవశ్యకత ఉంది కదా! అందువలన కోట మరమ్మతులకు నేనూ అక్షయుడూ కలిసి ప్రతిపాదనలను తయారుచేయించాము. వాస్తు శాస్తజ్ఞ్రులూ, కోట నిర్మాణ సాంకేతిక వర్గమూ, కర్మకరుల ప్రతినిధులూ - అందరూ వీటిని పరిశీలించి వారివారి సూచనలనిచ్చారు. తుది నిర్ణయం ప్రభువులది’
ఆ వెంటనే అక్షయుడు, ‘కోట మరమ్మతుల ప్రతిపాదనలో కీలక అంశం ఒకటి వున్నది. ఇది కూడా ‘అన్న’ చేసిన ప్రతిపాదనే. మనది మూడు ప్రాకారాలు కలిగిన జలదుర్గం. కోట చుట్టూ వున్న అగడ్త చాలావరకూ పూడికకు సిద్ధమైంది. దానినీ తీయించాలి. ఈ పూడిక పనిలో వచ్చే మట్టిని ఎక్కడిదానినక్కడే వినియోగించుకోవటానికి అవకాశం ఉంది. దానికై మొదటి ప్రాకారానికి గల రెండు గోడల మధ్యన ఉపరితలంలో ఒక బాటని నిర్మించే పథకాన్ని సిద్ధం చేశాము. దాన్నీ చిత్తగించమని నా మనవి’ అన్నాడు.
సాంకేతిక విజ్ఞులు ఈ ప్రతిపాదనని చాలా ఉపయుక్తమైన కార్యంగా కొనియాడారు. దీనివలన వొనగూడే ప్రయోజనం విలువైనదని వివరించారు. చంద్రహాసుని ఆలోచనలో అతని ముందుచూపూ, పరిణతీ కనిపిస్తున్నదని కూడా ప్రశంసించారు.
ఆ తర్వాత - ఆ ప్రతిపాదనలకు సంబంధించిన ఆర్థికాంశాలను గురించీ, కావలసిన వస్తు సంబారాల గురించీ చర్చ జరిగింది. పనిని ఎప్పుడు మొదలుపెట్టాలో నిర్ణయం జరిగింది. ప్రభువు ఆ పనుల నిర్వహణకి తన అనుమతిని తెలియజేశాడు.
సమావేశం ముగిసింది.
ఇష్టాగోష్టి జరుగుతోంది. ఆచార్యుల వారు చంద్రహాసుని భుజం తట్టి - ఒక్కొక్క వ్యవహారం ఆధారంగా - వ్యక్తిగా, సమిష్టిలోని ఒక సభ్యునిగా నిన్ను నీవు తీర్చిదిద్దుకుంటున్న వైనం మా అందరికీ సంతోషం కలిగిస్తోంది. రాజ్యక్షేమానికి నీ వంటి యువకుల చాకచక్యం, సమర్థత అంది వస్తున్నాయి. సంతోషం. శుభం భూయాత్’ అన్నారు.
‘అంతా గురువుల ఆశీర్వాదం. ఆపైన ప్రభువుల ఆదరం’ కైమోడ్చి అన్నాడు చంద్రహాసుడు. ‘మరి.. ఈ తమ్ముని సహాయం...!’ అని ప్రశ్నార్థకాన్ని వదిలాడు అక్షయుడు. ‘అదే అసలైన అండ కదా! నీ సహకారమే తొలి మెట్టు కదా!’ అన్నాడు అడివప్ప. ‘అవును గురువుగారూ, అక్షయుని దత్తత గురిచి నేను గొప్పలు చెప్పుకుంటే ఆత్మస్తుతి కిందకు వస్తుంది కదా!’ ‘అవునవును’ అంటూ అందరూ నవ్వుకున్నారు.
ఆవలగా ఉన్న కుళిందకుడు ఈ ముచ్చటనంతా గమనించి మనసారా నవ్వుకున్నాడు.
‘చిరంజీవ, చిరంజీవ’ అని రెండుసార్లు అనుకున్నాడు. అవి - చంద్రహాస అక్షయులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిండు దీవెన!
27
కళింద్ర కోట మరమ్మత్తులు సాగుతున్నై.
అంతర్భాగం ప్రాంగణాలలో మంటపాలూ, వేదికలూ వంటి కొత్త ఏర్పాట్లు కూడా పూర్తి చేయబడినవి.
కోట పునరుద్ధరణ అయింది. దానికి మరికొన్ని అందాలనూ అమర్చారు. నగర ప్రజలంతా నేటి కోటను చూసి సంబరపడిపోతున్నారు. ఇటు మండలేశ్వరుడు, ఇతర రాజ ప్రముఖులూ, రాజ్యాధికారులూ, అటు సామాన్యులూ చంద్రహాస అక్షయుల చొరవని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బహుథా ప్రశంసిస్తున్నారు.
ఆ సాయంత్రం-
చంద్రహాస అక్షయులూ, దుర్గీ పద్మినీ - విష్ణ్వాలయానికి వచ్చారు. అర్చనాదికాలు అయినవి. ప్రాంగణంలో మంటపం మెట్ల మీద కూర్చుని ఇష్ట భాషణలో నిమగ్నులైనారు.
అప్పుడు ఈ ప్రసక్తి తెచ్చాడు అక్షయుడు, ‘ఊపిరి సలుపనీయని రాచకార్యాల నుంచీ ఇప్పటికి కొంచెం వెసులుబాటు చిక్కింది. కోట పనులు పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మంచి పని చేస్తే?’
‘మంచి పనే..? ఆఁ..! నీ ఆలోచన నుంచే వస్తున్నదా సోదరా?’ అని పరిహాసమాడింది పద్మిని. కినుకతో ‘నేనంటే మరీ పరిహాసంగా ఉంది నీకు. ఏం బాగాలేదు’ అని ముఖం ముడుచుకున్నాడు. దుర్గి అన్నది ‘అక్షయులకి ముక్కు మీదే ఉంటుంది కోపం. చాల్లేగానీ ముందా మంచి పని చెప్పండి మహాశయా!’
చంద్రహాసుడు సన్న నవ్వుతో వేచి చూస్తున్నాడు.

-విహారి 98480 25600