క్రీడాభూమి

బట్లర్ మెరుపు శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాక్‌ను ఓడించి వనే్డ సిరీస్‌ను గెల్చుకున్న ఇంగ్లాండ్
దుబాయ్, నవంబర్ 21: ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జొస్ బట్లర్ అజేయ మెరుపు శతకం పాకిస్తాన్‌తో జరిగిన చివరి, నాలుగో వనే్డలో ఇంగ్లాండ్‌కు 84 పరుగుల తేడాతో విజయాన్ని అందించింది. ఓపెనర్ జాసన్ రోయ్ కూడా సెంచరీ చేయడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 355 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 40.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను రోయ్‌తో కలిసి ఆరంభించిన అలెక్స్ హాలెస్ 22 పరుగులు చేసి మహమ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అనంతరం జో రూట్‌తో కలిసిన రాయ్ రెండో వికెట్‌కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అతను 117 బంతులు ఎదుర్కొని, 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 102 పరుగులు చేసి యాసిర్ షా బౌలింగ్‌లో బాబర్ ఆజమ్‌కు దొరికాడు. అతను అవుటైన కొద్ది సేపటికే రూట్ (71) ఇన్నింగ్స్ కూడా ముగిసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 14, జేమ్స్ టేలర్ 13 పరుగులు చేసి అవుట్‌కాగా, 50 ఓవర్లు ముగిసే సమయానికి మోయిన్ అలీ (4)తో కలిసి బట్లర్ క్రీజ్‌లో ఉన్నాడు. అతను కేవలం 52 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 116 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, ఇంగ్లండ్‌ను ఓడించడానికి 356 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ 45 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను అహ్మద్ షెజాద్ (13) రూపంలో చేజార్చుకుంది. మిడిల్ ఆర్డర్‌లో బాబర్ ఆజమ్ (51), షోయబ్ మాలిక్ (52) మినహా మిగతా వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో మరో 56 బంతులు మిగిలి ఉండగానే పాక్ 271 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్, మోయిన్ అలీ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.(చిత్రం) సూపర్ ఇన్నింగ్స్.. జొస్ బట్లర్ 52 బంతుల్లో 116 నాటౌట్