సబ్ ఫీచర్

చదువులేకపోతేనేం! సత్తా చూపితే చాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే బాగా చదువుకోవాల్సిన అవసరం లేదు. తగిన అర్హతలు ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా నిర్దిష్టమైన లక్ష్యం, లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన కృషి మాత్రమే. చేస్తూన్న పనిపట్ల నమ్మకం చాలు. అలా చేసినపుడు సాధించలేనిదంటూ ఏమీ లేదు’’ అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన జానైన్ అలీస్. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ తానేనని ఆమె చెబుతారు. అలీస్ 16 సంవత్సరాల వయస్సులో చదువు మానేసింది. అనంతరం ఆమె వివాహం అయిన తరువాత, పిల్లలకు తగిన శక్తిని ఇచ్చే, ఆరోగ్యరమైన జ్యూస్‌లు అందుబాటులో లేవనే బెంగ ఆమెకు ఉండేది. ఆమె ఒకసారి తన భర్త తన ముగ్గురు పిల్లలతో కలిసి విహారయాత్ర కోసం అమెరికా వెళ్లింది. అమెరికా పర్యటనలో ఆమెకు ఫ్రూట్ జ్యూస్ బార్ పెట్టాలనే ఆలోచన కలిగింది. మెదడులో పుట్టిన ఆలోచన ఆమెకు మంచిరోజులు తెచ్చిపెట్టాయ. ఈ అనంతరం ఆమె ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తరువాత 2000లో అడిలైడ్‌లో ఫ్రూట్ జ్యూస్ బార్‌ను ప్రారంభించింది. ఈ రంగంలో ఆమెకు అనుభవం లేకపోయినా అధైర్యపడకుండా తన సత్తా చాటింది. ఫ్రూట్‌జ్యూస్ బార్ విజయవంతం కావటంతో తన ఆలోచనలకు మరింత పదును పెట్టింది. ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందుకు భర్త సహకారం తోడవ్వటంతో ఆమె ఉన్నత శిఖరాలను సులువుగా అధిరోహించటానికి మార్గం సుగమమైంది. తదనంతరం ఈ రిటైల్ వ్యాపారాన్ని దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం విస్తరించేందుకుగానూ రిటైల్ జో అనే కంపెనీని ప్రారంభించింది. ఖర్చుకు వెనకాడకుండా కంపెనీలను లాభాల బాటలో నడిపించింది. తన ఉత్పత్తులలో నాణ్యతకు పెద్దపీట వేయటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. ఇది విజయవంతం కావడంతో రిటైల్‌జో అనే కంపెనీని ప్రారంభించింది. ప్రస్తుతం అలీస్‌కు చెందిన ఫ్రూట్ జ్యూస్ బార్‌లు 14 దేశాలలో పనిచేస్తున్నాయి. దాదాపు 250 స్టోర్స్ నడుస్తున్నాయ. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 1074 కోట్ల రూపాయలు. చేస్తూన్న పని పట్ల నిబద్ధత ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అలీస్. (చిత్రం) జానైన్ అలీస్

-పి.హైమావతి