రాష్ట్రీయం

అమ్మో చలికాలం.. స్వైన్‌ఫ్లూ కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత అనుభవాలతో అప్రమత్తమైన ప్రభుత్వం
ఆగస్టు నుంచి 17 మంది మృతి
డిసెంబర్ నుంచి విజృంభించే అవకాశం
నివారణకు ముందస్తు వ్యాక్సినే్ల మేలంటున్న వైద్యులు

హైదరాబాద్, నవంబర్ 22: చలికాలం వచ్చిందంటే చలికి భయపడే వాళ్లు. కానీ గత నాలుగేళ్లగా స్వైన్ ఫ్లూగా పిలువబడే హెచ్1ఎన్1 వైరస్‌కు భయపడుతున్నారు. వర్షాకాలం నుంచి మొదలై చలి కాలం పూర్తయ్యే వరకు స్వైన్ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్నీ హడలెత్తిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ 20 వరకు 3561 మంది రక్త నమూనాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో పరీక్షిస్తే 556 పాజిటివ్‌గా తేలిందని, స్వైన్‌ఫ్లూతో పాటు మరికొన్ని కారణాలతో 17 మంది మృతి చెందినట్లు తెలంగాణ వైద్య శాఖ విడుదల చేసిన బులిటెన్ స్పష్టం చేసింది. ఈ వ్యాధి తీవ్రత ప్రతి ఏడాది దాదాపు పెరుగుతూనే వస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో స్వైన్‌ఫ్లూ బాధితులు ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా చాలా జిల్లాల్లో వైద్యం పొందారు. జిల్లాల్లో రోగుల పరిస్థితి సీరియస్‌గా ఉంటే హైదరాబాద్ కూడా తరలించారు. స్వైన్‌ఫ్లూ ప్రభావం ప్రతి ఏడాది తీవ్రంగానే కనిపిస్తోంది. 2009 మే నుంచి డిసెంబర్ వరకు 777 కేసులు నమోదు కాగా 52 మంది చనిపోయారు. 2010 జనవరి నుంచి డిసెంబర్ వరకు 733 కేసులు నమోదై 49 మరణాలు సంభవించాయి. 2011లో 11 కేసులు నమోదై 1 మృతి, 2012లో 326 కేసులు నమోదు కాగా 34 మరణాలు సంభవించాయి. 2013లో 69 కేసులు నమోదై 7 మరణాలు, 2014 నవంబర్ నుంచి జనవరి 2015 వరకు 2,300 కేసులు నమోదై 83 మంది చనిపోయారు. కాగా ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ వరకు 17 మంది స్వైన్‌ఫ్లూ, ఇతర కారణాలతో చనిపోయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒకరి నుంచి ఒకరికి సోకే ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లు ప్రతి ఏడాది చేస్తోంది. అయినప్పటికీ వైరస్ విస్తరణ ప్రభావం తగ్గడం లేదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, శుభ్రత పాటించని వారికి, గర్భిణీలకు స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఎక్కువంగా ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. గర్భిణులు ఎక్కువగా ప్రయాణించడం, ఐరన్ సప్లిమెంట్స్, ఆహారం అధికంగా తీసుకోవడం వంటివి తగ్గించాలని అంటున్నారు. ఇంతేకాకుండా వైద్యుల సలహా మేరకు ముందస్తు నివారణకు వ్యాక్సిన్లు తీసుకోవడం ఉత్తమమైన మార్గమని తెలియజేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు వ్యాక్సిన్లను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని భోధనాసుపత్రులు, జిల్లా హాస్పిటళ్లు, ఏరియా హాస్పిటళ్లులో వ్యాక్సిన్లను నిల్వ ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. అతిగా జ్వరం, దగ్గు, శరీర నొప్పులు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. హోమియో మందును కూడా ముందస్తు నివారణకు స్వీకరించవచ్చని తెలిపారు. రామాంతపూర్‌లోని ప్రభుత్వ హోమియోపతి హాస్పిటల్‌లో హోమియో మందులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉచితంగా పొందవచ్చని సూచించారు. అలాగే ఆయుష్ డిస్పెన్షరీల్లో కూడా అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. కాగా స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు రానున్న కొన్ని నెలల్లో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో నోడల్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. యర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ నుంచి కొందరు స్వైన్‌ఫ్లూ వైద్యం చేసేందుకు గాంధీ హాస్పిటల్‌కు పంపించనున్నారు. దీంతో అక్కడ ఈ విభాగంలో పని చేసే డాక్టర్ల సంఖ్య 24కు చేరుతుంది.