కృష్ణ

విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ నేడు ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* 18 ఏళ్ల తర్వాత తొలిసారిగా హోరాహోరీ
* ఎన్నికల బరిలో రెండు ప్యానెల్స్, 92 మంది అభ్యర్థులు
* వక్కలగడ్డ, సిఎల్ కాంతారావులలో 8వ అధ్యక్షుడు ఎవరో!
విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలోనే పేరు ప్రతిష్ఠలు పొందిన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ పాలకవర్గానికి 18ఏళ్ల తర్వాత తిరిగి ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు ప్రస్తుత అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్‌రావుతో పాటు గాంధీజీ మహిళా కళాశాల కరస్పాండెంట్, వ్యాపార వేత్త సిఎల్ కాంతారావులు ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకుని ఎన్నికల కదనరంగంలోకి దిగారు. ఇరువురు కూడా ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాకరంగా తీసుకోవటంతో గడచిన రెండు వారాలుగా మినీ అసెంబ్లీ ఎన్నికలను తలిపించే రీతిలో హోరాహోరీగా ప్రచారం సాగింది. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్‌లు వెలిశాయి. తొలుత వక్కలగడ్డ ప్రచారం ఏకపక్షంగా సాగినప్పటికీ క్రమేణా నీవా నేనా అనే రీతిలో పోటీ నెలకొంది. ఎన్నికల సందర్భంగా కాంతారావు కొత్తగా 500 మందిని సభ్యులుగా చేర్పిస్తే, ఇంకేముంది వక్కలగడ్డ చేతిలో అధికారం ఉంది కదా. ఏకబిగిన 800 మందిని చేర్పించేశారని చెబుతున్నారు. మొత్తంపై 2600 మంది ఓటు హక్కు కల్గి ఉన్నారు. మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గాంధీనగరంలోని చాంబర్ భవన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా నియమితులైన న్యాయవాది కెవివి పరమేశ్వరరావు, మేనేజర్ కామేశ్వరరావుల ఆధ్వర్యంలో మొదటి, రెండో అంతస్తులలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అసలు సభ్యత్వం కూడా ఐదు కేటగిరీలలో ఉంది. కేటగిరి ఎ వ్యక్తిగత సభ్యత్వం కల్గిన వారి నుంచి ఏడు డైరెక్టర్ పదవులు కేటగిరి బిలో ఏదైనా వ్యాపార సంస్థల పేరిట ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. దీని నుంచి 8 పదవులు, కేటగిరి సిలో ఒక్కో అసోసియేషన్ తరఫున ఒక్కొక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ఈ విభాగం నుంచి 12 డైరెక్టర్ పదవులు, కేటగిరి డిలో శాశ్వత సభ్యత్వం కల్గిన వారికి ఓటింగ్ అర్హత ఉంటుంది. ఈ విభాగంలో 15 పదవులు ఇక కేటగిరి-ఇలో పరిశ్రమల తరఫున మూడు పదవులు వెరశి మొత్తం 45 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవాల్సి ఉంది. వీరంతా కల్సి అధ్యక్షుడు ఇతర పాలకవర్గ సభ్యులను ఎన్నుకుంటారు. బుధవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. సిఎల్ కాంతారావు ప్యానెల్‌లో 44 మంది వక్కలగడ్డ ప్యానెల్‌లో 45 మంది పోటీ చేస్తుండగా వారితో పాటు ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. పాలకవర్గం పదవీ కాలపరిమితి రెండేళ్లు కాగా మొదటి నుంచి 1998-2000 ఎన్నికలు మినహా ప్రతిసారి కూడా ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తున్నాయి. తొలిసారిగా బచ్చు వెంకటేశ్వర్లు 1955-63 మధ్య మొదటి అధ్యక్షునిగా పనిచేశారు. 1964-77 మధ్య రెండో అధ్యక్షునిగా పచ్చిపులుసు వెంకట సుబ్బారావు, 1978-79 మధ్య మూడో అధ్యక్షునిగా అప్పనరాజు గోపాలరావు, 1980-85 మధ్య 4వ అధ్యక్షునిగా పచ్చిగోళ్ల వెంకట రావు, అధ్యక్షునిగా పనిచేశారు. ఇక 1986-2011 మధ్య అంటే చనిపోయే వరకు గడ్డం సుబ్బారావు 25 ఏళ్లపాటు ఛైర్మన్‌గా తిరుగులేని ఆధిపత్యం వహించారు.
అయితే 1998-2000 పదవీకాలానికై సిట్టింగ్ అధ్యక్షులు గడ్డం సుబ్బారావు, సిఎల్ కాంతారావు ప్యానెల్స్ మధ్య హోరాహోరీగా ఎన్నికలు జరుగ్గా స్వల్ప ఆధిక్యతతో గడ్డం సుబ్బారావు గెలిచి ఆపై మళ్లీ ఏకగ్రీవంగానే ఎన్నికవుతూ వచ్చారు. 2012-13 మధ్య ఆరో అధ్యక్షునిగా వెల్లంపల్లి రామచంద్రరావు, 2014-16 మధ్య ఏడో అధ్యక్షునిగా వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షునిగా పనిచేశారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత కాంతారావు మళ్లీ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఈ దఫా ఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు కూడా హోరెత్తాయి. ప్రధానంగా రెండు ప్యానెల్స్‌లోనూ అత్యధిక మంది ఆర్య వైశ్యులే పోటీలో ఉన్నప్పటికీ ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు కొద్దిరోజులుగా వక్కలగడ్డ తరఫున ప్రచారం చేయడాన్ని ఆర్యవైశ్య ప్రముఖులు తప్పుబడుతున్నారు. గడచిన రెండేళ్లలో తాను చేసిన చాంబర్ అభివృద్ధే తన ప్యానెల్‌ను విజయపథంవైపు నడిపించగలదని వక్కలగడ్డ చెబుతున్నారు. అయితే చాంబర్ ఎన్నో ఏళ్లకు అభివృద్ధి లేకుండా ఎన్నో వైఫల్యాలతో నిర్వీర్యమై వ్యాపారులెవరికీ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. తాను ఎన్నికైతే అమరావతిలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక వర్గాలకు ట్రేడ్ సెంటర్ పేరిట స్థలం కేటాయింపుకు కృషి చేస్తానన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు చేస్తామని, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులకు సహకారం అందిస్తామని సిఎల్ కాంతారావు తన ప్రచారంలో హోరెత్తించారు.