క్రీడాభూమి

చమీర మెరుపుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 19: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఎదురుదాడికి దిగింది. దుష్మంత చమీర మెరుపు దెబ్బ తీయడంతో, ఒక దశలో కేవలం వికెట్ నష్టం లేకుండా 81 పరుగులు చేసిన న్యూజిలాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. మొదటి రోజైన శుక్రవారం వర్షం కారణంగా ఆటను నిర్ణీత సమయానికి కంటే ముందుగానే నిలిపివేసే సమయానికి శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 264 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం ఉదయం ఆటను కొనసాగించి, 292 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (77), మిలింద సిరివర్ధన (62) అర్ధ శతకాలను మినహాయిస్తే, లంక బ్యాట్స్‌మెన్ ఎవరూ కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. టిమ్ సౌథీకి మూడు వికెట్లు లభించగా, ట్రెంట్ బౌల్ట్, డౌగ్ బ్రాస్‌వెల్ చెరి రెండు వికెట్లు సాధించారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభం బాగానే ఉన్నప్పటికీ ఆతర్వాత హఠాత్తుగా పతనం ఆరంభమైంది. మొదటి వికెట్‌కు మార్టిన్ గుప్టిల్, లాథమ్ 81 పరుగులు జోడించారు. 28 పరుగులు చేసిన టామ్ లాథమ్‌ను కరుణరత్నే క్యాచ్ అందుకోగా చమీర అవుట్ చేయడంతో కివీస్ మొదటి వికెట్ కోల్పోయింది. మరో ఎనిమిది పరుగులు స్కోరుకు జత కలవగా, మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. కేన్ విలియమ్‌సన్ కేవలం ఒక పరుగు చేసి చమీర బౌలింగ్‌లో లక్మల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని 50 పరుగులు చేసిన మార్టిన్ గుప్టిల్‌ను మాథ్యూస్ క్యాచ్ అందుకోగా, రంగన హెరాత్ పెవిలియన్ దారి పట్టించాడు. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ (0), ప్రస్తుత కెప్టెన్ బ్రెండ్ మెక్‌కలమ్ (18) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా, మిచెల్ సాంట్నర్ (38), బిజె వాల్టింగ్ (28) జట్టును ఆదుకోవడానికి కొంత సేపు ప్రయత్నించారు. చివరిలో బ్రాస్‌వెల్ (30) పరుగులతో నాటౌట్‌గా నిలవగా, సౌథీ (4), నీల్ వాగ్నర్ (17) అవుటై వెనుదిరిగారు. నిర్ణీత ఓవర్లు ముగియడానికి మరో రెండు బంతులే మిగిలి ఉండడంతో, రెండో రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. శ్రీలంక కంటే కివీస్ ఇంకా 60 పరుగులు వెనుకంజలో ఉంది. ఒక వికెట్ మాత్రమే మిగిలివున్న నేపథ్యంలో లంకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఖాయంగా కనిపిస్తున్నది. (చిత్రం) ఒక దశలో పటిష్ఠంగా ఉన్న న్యూజిలాండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీసి, ఐదు వికెట్లు పడగొట్టిన శ్రీలంక బౌలర్ చమీర.

సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 7 వికెట్లకు 264): 81. ఓవర్లలో ఆలౌట్ 292 (కుశాల్ మేండిస్ 31, చండీమల్ 47, ఏంజెలో మాథ్యూస్ 77, సిరివర్దనే 62, సౌథీ 3/63, బౌల్ట్ 2/51, బ్రాస్‌వెల్ 2/81).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్: 78.4 ఓవర్లలో 9 వికెట్లకు 232 (మార్టిన్ గుప్టిల్ 50, వాల్టింగ్ 28, సాంట్నర్ 38, బ్రాస్‌వెల్ 30 నాటౌట్, చమీర 5/47, హెరాత్ 2/75).