తెలంగాణ

చండీయాగానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదేవ్‌పూర్, డిసెంబర్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యవసాయ క్షేత్రం సంపూర్ణమైన ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలో గల తన వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి 27 వరకు నిర్వహించే అయుత చండీ మహాయాగం పనులు పూర్తి కాగా, 106 హోమగుండాలను విఐపిలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దర్శించుకునే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే యాగశాలలో అందరూ దర్శించుకునేందుకు వీలుగా చండీ మాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రోజుకు 1000 నుంచి 2000 మంది వరకు మహిళలు కుంకుమార్చనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, కుంకుమార్చనకు కావాల్సిన పూజా సామగ్రిని యాగశాల వద్ద ఉచితంగా అందజేయనున్నారు. అయితే బుధవారం నుంచి చండీ మహాయాగం పూజలు ప్రారంభంకానున్న దృష్ట్యా మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు చెందిన వేద పండితులు యాగశాలకు చేరుకున్నారు. అయితే శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ భారతీతీర్థ స్వామి వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ యాగానికి ఆరు పీఠాలకు చెందిన పీఠాధిపతులు చిన్న జియరు స్వామి, పరిపూర్ణానంద, స్వరూపానంద, జయేంద్ర సరస్వతి, మాధవానంద సరస్వతి, హాజరుకానున్న దృష్ట్యా వారికి కావాల్సిన వసతి సౌకర్యాలను శృంగేరి పీఠం వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ పర్యవేక్షిస్తున్నారు. అలాగే 26న తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ఇతర ప్రముఖలు, 27న రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ యాగానికి హాజరవుతున్నందున ఫాంహౌస్‌లో ఐదు హెలిప్యాడ్‌లను సిద్ధం చేశారు. అయుత చంఢీ యాగానికి ప్రముఖులు హాజరవుతున్నందున ఫాంహౌస్‌కు చేరుకునే రెండు మార్గాలలో నిఘానేత్రాలతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే ఈ యాగానికి హాజరయ్యే భక్తులకు భోజన వసతిని కల్పిస్తున్నారు.
3000 మంది పోలీసులతో భద్రత
సీఎం ఫాంహౌస్‌లో నిర్వహించనున్న అయుత చండీ యాగానికి ఆయా రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ, వ్యాపార, మీడియా ప్రతినిధులు హాజరవుతున్నందున 3000ల పోలీసు బలగాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే చండీ యాగానికి హాజరయ్యే ప్రముఖుల వాహనాల కోసం వేరు వేరుగా పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. అయితే భద్రత చర్యలను ఐజి నవీన్‌చంద్, ఎస్‌పి సుమతిలు పర్యవేక్షిస్తున్నారు.

యాగశాల ముందు ఏర్పాటు చేసిన స్వాగత తోరణం
యాగశాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్
యాగశాలలో పాల్గొన్న వేదపండితులు