రాష్ట్రీయం

ఏపికి కేంద్ర సాయం అందేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైపరీత్యాల సాయానికి నిధుల కొరత
ఒకవైపు కరవు, మరోవైపు వరదలతో నష్టం
ప్రధాని మోదీపై సిఎం చంద్రబాబు ఆశలు
హైదరాబాద్, నవంబర్ 23: ఒకవైపు కరవు, మరోవైపు వరదలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందుతుందా అన్నది చర్చనీయాంశం అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరవు ప్రాంతాలను ప్రకటించింది. ఇటీవల దక్షిణకోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దాంతో భారీ నష్టం జరిగింది. కరవు పరిస్థితి వల్ల పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతుండగా, దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో బావులు, గొట్టపుబావులు తదితర నీటి వనరుల కింద వరి తదితర పంటలు వేసుకున్న రైతులు ఇటీవలి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు.
ప్రకృతివైపరీత్యాల పరిస్థితిపై సచివాలయంలో సోమవారం రెవెన్యూ, డిజాస్టర్, వ్యవసాయం, ఉద్యాన తదితర శాఖల ఉన్నతాధికారులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కరవు పరిస్థితిపై ఒక నివేదికను, భారీ వర్షాలు, వరదల వల్ల ఒనగూడిన నష్టాలపై మరో నివేదికను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి చినరాజప్ప, వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు ఇప్పటికే వరదల నష్టాలపై ప్రకటనలు జారీ చేశారు. వారి ప్రకటనలను, వాస్తవ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారికంగా నివేదికలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ల నుండి కరవు పరిస్థితిపై పూర్తి సమాచారం ఇప్పటికే వచ్చింది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి ప్రాథమిక నివేదికలు జిల్లాల నుండి వచ్చినప్పటికీ, పూర్తిస్థాయి నివేదికల కోసం ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి నష్టాలకు సంబంధించిన నివేదికలను రూపొందిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో సమగ్ర నివేదికలను కేంద్రప్రభుత్వానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వరదలవల్ల జరిగిన నష్టానికి సంబంధించి తాత్కాలిక సహాయ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. బియ్యం, చక్కెర, కందిపప్పు, కిరోసిన్ తదితర నిత్యావసర సరకులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఇళ్లు, ఆస్తినష్టం, పంటలకు జరిగిన నష్టం, ప్రాణనష్టం, పశువులకు ఒనగూడిన నష్టాలకు సంబంధించి ప్రజలకు సాయం చేసే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా నిధులు అవసరం ఉంటుంది. అలాగే కరవుకు గురైన ప్రాంతాల్లో రైతులను ఆదుకునేందుకు కూడా భారీగానే నిధులు అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతో సతమతమవుతోంది. ప్రణాళిక, ప్రణాళికేత వ్యయాలకు సంబంధించిన నిధులకోసమే ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ప్రకృతివైపరీత్యాల కారణంగా ఇక్కట్లకు గురైన ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా నిధులు అవసరం ఉంటుంది.
ఖాళీగా ఉన్న ఎస్‌డిఆర్‌ఎఫ్
స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) లో ప్రస్తుతం నిధులు ఏమీ లేవు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ఇవ్వాల్సిన 330 కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదల చేశారు. అలాగే ఇదే ఫండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా విడుదల చేయాల్సిన 110 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. అలాగే 2014 కరవుపరిస్థితికి సంబంధించి 181 కోట్ల రూపాయలు కూడా కేంద్రం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 768 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే 146 కోట్ల రూపాయల లోటు ఉన్నట్టు తేలుతోంది. ఈ పరిస్థితిలో కరవుప్రాంతాల్లోనూ, వరదలకు గురైన ప్రాంతాల్లోనూ నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. పరిపాలనాపరంగా కేటాయింపులు చేయడం వేరు, నిధులు విడుదల చేయడం వేరు. కరవు, వరదలకు గురై ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు కేంద్రమే ఉదారంగా ఆర్థిక సాయం అందించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
సాయానికి జాప్యం
కేంద్ర ప్రభుత్వం అనామతుగా నిధులు కేటాయించలేదని ప్రభుత్వ నియమావళి స్పష్టం చేస్తోంది. ప్రకృతివైపరీత్యాల కింద కేంద్రం సాయం చేయాలంటే తొలుత కేంద్రం నుండి అధికారిక బృందాలు వచ్చి, పరిస్థితి పరిశీలించి, నివేదిక రూపొందిస్తే అప్పుడు నిధుల విడుదలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ ప్రహసనమంతా పూర్తయ్యేందుకు కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది, ఆ తర్వాత కేంద్రం అవసరమైన నిధులను మంజూరి చేయడానికి మరికొంత సమయం పడుతుంది. అందుకే ప్రస్తుతం రాష్ట్రం తన ఖజానానుండి నిధులు విడుదల చేస్తే, ఈ మేరకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రం ఎంతమేరకు ఆర్థిక సాయం చేస్తుందో ఇప్పటికిప్పుడే తెలియదు.