రాష్ట్రీయం

జగన్‌కు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: శాసనసభలో సోమవారం ఒక అరుదయిన సన్నివేశం ఆవిష్కృతమైంది. రాజకీయంగా పరస్పర బద్ధ శత్రువులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ కరచాలనం చేసుకున్నారు. విశేషమేమిటంటారా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 43వ జన్మదినోత్సవం సందర్భంగా జగన్ కూర్చున్న సీటు వద్దకు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి కరచాలనం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే జగన్ ఉన్న సీటు వద్దకు చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుతో కలిసి వచ్చారు. చంద్రబాబు చొరవను ఉభయ పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతించారు. స్పీకర్ స్థానంలో ఆసీనులైన వెంటనే డాక్టర్ కోడెల శివప్రసాదరావు కూడా జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.