రాష్ట్రీయం

ఇది నాలుగు రాష్ట్రాల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు కాంగ్రెస్ వల్లే సమస్య జటిలమని ఆరోపణ

శాంతిపురం, డిసెంబర్ 10: కృష్ణా జలాల వివాదం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే కాదని, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా సంబంధించినదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గురువారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన జనచైతన్య యాత్రలో మాట్లాడిన ఆయన కృష్ణా జలాల వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందన్నారు. దీనిపై కోర్టులో సమర్థవంతంగా వాదించక పోవడంతో ఈ వివాదం జటిలమైందన్నారు. ఫలితంగా ఇప్పుడు కృష్ణా జలాల పంపిణీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెను వివాదంగా మారిందన్నారు. వరదలు వస్తే చిన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర కష్టాలు భరించాల్సి వస్తుందని, తీవ్రంగా నష్ట పోవాల్సి ఉంటుందని తెలిపారు. మిగులు జలాలను పైనున్న రాష్ట్రాలు వాడుకొని నీరు విడుదల చేయకపోతే కిందనున్న రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయన్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని బచావత్ కమీషన్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రం 512 టి ఎంసిలు, తెలంగాణ రాష్ట్రం 299 టి ఎంసిలు ఇచ్చారన్నారు. రెండు రాష్ట్రాలకు 821 టి ఎంసిల నీరు రావాల్సి ఉందన్నారు. దామాషా ప్రకారం రాష్ట్రాల మిగులు జలాలను పంపిణీ చేయాల్సి ఉన్న అలా కానీ పక్షంలో చివరగా ఉన్న రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని కృష్ణా జలాలు రాకపోతే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నదిలో నీళ్లు లేకపోతే సముద్రం నుంచి ఉప్పు నీరు పొలాలకు చేరి రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. నదీ జలాల అనుసంధానం కలగా మారి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసామని అన్నారు. గోదావరి, కృష్ణ నదుల అనుసంధానం లాగానే కృష్ణ, పెన్నా నదుల అనుసంధానాన్ని త్వరలోనే చేపడుతామన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలంలో నీరు లేవన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. అస్తవ్యప్తంగా విభజన చేసి రాష్ట్రాన్ని అనేక కష్ట నష్టాలను ఎదుర్కొనేలా చేశారన్నారు. అయినప్పటికీ ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేసే ప్రశక్తే లేదని అప్పు చేసి అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రజలు కూడా బాధ్యతతో వ్యవహరించి ఆదాయ వనరులు పెంచుకోవాలని అందుకు అవసరమైన ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తామన్నారు. ప్రభుత్వమే అన్ని చేస్తుందని ఎవరికి వారు అనుకుంటే భవిషత్తులో సంక్షేమ పథకాలు చేపట్టడం ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఒక కుటుంబ యజమాని సంపాదన ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ముందుకు సాగుతుందని అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా సహకరించాలని కోరారు. (చిత్రం) చిత్తూరు జిల్లాలో పంటసంజీవని రథం ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు