అక్షర

చందుపట్ల గ్రామ ‘కైఫీయత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావూరు చందుపట్ల
-డా.శ్రీరంగాచార్య
వెల: రు.100/-;
ప్రతులకు- రచయిత, 11-14-25,
హరిపురి కాలనీ
హైదరాబాద్- 500 102.
ఫోన్: 9299451266

ఎవరూ రాయని రచననూ, రాయలేని రచననూ, విలక్షణమైన రచననూ విశిష్ట రచన అంటారు. ఇటువంటి విశిష్ట రచన శ్రీ రంగాచార్య రాసిన ‘‘మావూరు చందుపట్ల’’ పుస్తకం. వీరు మరింగంటి కవుల సాహిత్యసేవపై చేసిన రచన కూడా ఇటువంటిదే. ఆంగ్లేయులు మన గ్రామ చరిత్రలు రాయించారు. వాటికి కైఫియ్యత్‌లు అని పేరు. అటువంటి వాటిల్లో మెకంజీదొర కైఫీయత్‌లు చాలా గొప్పవి. కైఫియత్ అంటే స్థానిక చరిత్ర అని అర్థం. ఇప్పుడు అటువంటి స్థానిక గ్రామ చరిత్రను శ్రీరంగాచార్య శాశ్వతంగా అక్షర రూపంలో భద్రపరచి ‘‘మావూరు చందుపట్ల’’గా మనకి అందించారు. ‘‘మావూరు కథ’’. ‘‘గ్రామ కథలు’’, ‘‘గ్రామ నామాలు’’ వంటి రచనలు వచ్చాయి. కానీ ఈ పుస్తకం ప్రత్యేకంగా- ప్రామాణికంగా- సాంస్కృతికపరంగా- మానవ సంబంధాలపరంగా వివరంగా రాయబడినది.
చందుపట్ల గ్రామం నల్గొండ జిల్లా, నకరేకల్ మండలంలో వుంది. దీనికి రుద్రమదేవి చందుపట్ల అనే పేరూ వుంది. చందుపట్ల శాసనంలో రుద్రమదేవి మరణం 27.11.1289 అని స్పష్టంగా వుంది. రుద్రమదేవి కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపబడింది. (ఎన్.ముక్తేశ్వరరావు, ఐ.ఏ.ఎస్. సహకారంతో) దీనినిబట్టి చందుపట్ల గ్రామ ప్రాచీనత, చరిత్రక ప్రాధాన్యం తెలుస్తుంది. ఈ గ్రామంలోని చెరువుల ప్రత్యేకత తెలుస్తుంది. ఇందులో రచయిత వంశ చరిత్ర కూడా వుంది. గిరిజా మనోహరబాబు, డి.సూర్యకుమార్‌ల ముందుమాటలు తప్పక చదవాల్సినవే తప్ప మొక్కుబడి మాటలు కావు.
ఆనాటి భూములు, చందుపట్ల ప్రాచీనత అనే శీర్షికలే కాకుండా అప్పటి చుట్టుపక్కల గ్రామాలైన చెరుకుపల్లి, మంగలపల్లి వంటి వాటి విశేషాలూ ఉన్నాయి. ‘‘దీని ప్రాచీన లక్షణాలనుబట్టి ఒకప్పుడిది జైనుల ఆవాసమని...’’అనే అభిప్రాయాన్నీ తెలిపారు. ‘‘1947-48 సంవత్సరాల తరువాత రజాకార్ల, కమ్యూనిస్టుల అల్లర్లు మావూళ్ళో భయంకరంగా వున్నా దేవుని ఆరాధనాదులకు ఏవిధమైన భంగం వాటిల్లలేదు’’వంటి వార్తల్ని తెలుసుకుంటాం. చందుపట్ల గ్రామానికి 1973లో కరెంటు వచ్చిందట! ఆనాడు వడ్లగిర్నీలు (యంత్రాలు) లేకపోవటంవల్ల వడ్లు దంచుకోవడం తప్పనిసరి అట! ఇటువంటి పరిస్థితులు చందుపట్లలోనే కాదు తెలుగువారి అన్ని గ్రామాలలోనూ కనిపిస్తాయి. ఆనాటి వంటలు, ఆచారాలు, పండగలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే. రవికుమార్ ముందుమాటలో ‘‘తప్పాలచెక్కలు’’అనేది ఫక్తు తెలంగాణ వంటకం అనటం సరికాదు. కోస్తాలోనూ ఇవి ప్రసిద్ధమే- ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాలలో!
అనుబంధంలో ప్రామాణికంగా శాసనాలు ఇచ్చారు. చందుపట్ల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ విశేషాలు వెల్లడించారు. ‘‘చందుపట్ల రచయితలు, సాహిత్యము’’అనే అనుబంధం విశేషమైనది. అంతేకాదు కొన్ని ఛాయాచిత్రాలూ ఉన్నాయి. వాటిలో అరుదైనది ‘‘స్తంభాకృతిలోగల నృసింహస్వామి ఒకటి. మన చరిత్ర, మన గ్రామాల చరిత్ర, గ్రామ సంబంధాల చరిత్ర, ఒకనాటి జీవన విధాన చరిత్ర... తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే!

-ద్వా.నా.శాస్ర్తీ