తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్: ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన సీనియర్ రాజకీయ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు (95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన దశాబ్దాల పాటు సిపిఐలో ఉంటూ 1994లో టిడిపిలో చేరారు. సిరిసిల్ల నుంచి 5 సార్లు, మెట్టుపల్లి నుంచి ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు సోదరుడైన రాజేశ్వరరావు విద్యార్థి దశ నుంచి అనేక వామపక్ష ఉద్యమాల్లో పాల్గొని 2004లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు. వేములవాడ మండలం మారుపాకలో జన్మించిన ఆయన తెలంగాణ ప్రాంత స్వాతంత్య్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఆయన కుమారుడు చెన్నమనేని రమేష్ ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజేశ్వరరావు అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.