బిజినెస్

వరుస నష్టాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు వారాల తర్వాత లాభపడిన దేశీయ స్టాక్ మార్కెట్లు
సెన్‌సెక్స్ 258, నిఫ్టీ 94 పాయింట్లు వృద్ధి
కలిసొచ్చిన వేతన సంఘం సిఫార్సు, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు
వారాంతపు సమీక్ష
ముంబయి, నవంబర్ 21: దేశీయ స్టాక్‌మార్కెట్లు గడచిన వారం ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. వరుసగా మూడు వారాలపాటు నష్టపోయిన సూచీలు మదుపరుల కొనుగోళ్ళ మద్దతుతో కోలుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాన్ని 23.55 శాతం పెంచాలని 7వ వేతన సంఘం నివేదిక సిఫార్సు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అంతేగాక గత నెల అక్టోబర్‌కుగాను విడుదలైన టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు మైనస్ 3.81 శాతంగా నమోదవడం కూడా మదుపరులకు అమ్మకాల ఒత్తిడి నుంచి బయటకు రప్పించింది. ఈ క్రమంలోనే గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెన్‌సెక్స్ 257.96 పాయింట్లు పుంజుకుని 25,868.49 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 94.30 పాయింట్లు అందిపుచ్చుకుని 7,856.55 వద్ద నిలిచింది. కాగా, అంతకుముందు మూడు వారాల్లో సెన్‌సెక్స్ 1,860.28 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 533.20 పాయింట్లు పడిపోయింది. ఇదిలావుంటే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 2,464.43 కోట్ల రూపాయల విలువైన షేర్లను గడచిన వారం మొత్తంగా అమ్మేశారు. ఈ మేరకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వివరాలను తెలియజేసింది. ఇకపోతే ట్రేడింగ్‌లో రిఫైనరీ, ఎఫ్‌ఎమ్‌సిజి, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆటో, విద్యుత్ రంగాల షేర్లలో పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా విద్యుత్ రంగ షేర్ల విలువ అత్యధికంగా 4.59 శాతం పెరిగితే, చమురు, గ్యాస్ 4.28 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి 2.81 శాతం, క్యాపిటల్ గూడ్స్ 2.35 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.15 శాతం, ఆటో 2.02 శాతం, మెటల్ 0.68 శాతం, హెల్త్‌కేర్ 0.64 శాతం బ్యాంకింగ్ రంగం 0.56 శాతం చొప్పున షేర్ల విలువను పెంచుకున్నాయి. అయితే రియల్టీ 1.46 శాతం, ఐటి 1.11 శాతం, టెక్నాలజీ షేర్ల విలువ 0.53 శాతం చొప్పున పతనమైంది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ సూచీ 1.93 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 2.17 శాతం పెరిగాయి. టర్నోవర్ గడచిన వారం బిఎస్‌ఇ 13,611.90 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 77,391.75 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 9,089.11 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 54,951.43 కోట్ల రూపాయలుగా ఉంది.