మీ వ్యూస్

మార్పు కోరుతూ.. -- మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’ టైటిల్స్ నుంచి శుభం వరకు నాన్‌స్టాప్‌గా సాగింది. ఆద్యంతం ఉత్కంఠతతో సాగిన చిత్రంలో ఏమాత్రం కథ లేకపోయినా కథనంతో అద్భుతంగా నడిపించారు. బహుశా ఇలాంటి ప్రయోగం కమల్‌కే సాధ్యమేమో. రొటీన్‌తో విసుగెత్తివున్న ప్రేక్షకులకు రెండున్నర గంటల వినోదంతో కూడిన చిత్రం ఇప్పటి తరానికి కావాల్సిందే.
-జి సాహితి, కొమ్మెర

అలా చీకటిలో..
చీకటి రాజ్యం పేరు బాగున్నా సినిమా అంతా చీకట్లో సాగడంతో ఇబ్బంది పడ్డాం. కొన్ని షాట్స్, క్లోజప్‌లు, సింగిల్‌షాట్స్ గందరగోళంగా వేగంగా వెళ్లిపోయాయి. అర్థంకాకపోతే సినిమా బాగలేదనిపించిన మాట బయటకు వచ్చింది. సినిమా అర్థమయ్యేలా తీస్తే పాతబడిన కథ అనుకుంటారని, అందరూ ఇదే ధోరణిలో నిర్మిస్తున్నారు. సినిమా అర్ధమైతే మరికొన్నిసార్లు ప్రేక్షకులు చూస్తారు. రెండోసారి చూడాలనిపిస్తే రెండు నెలలు ఆగితే ఎటూ చానల్‌లో వస్తుంది కదా!
-శివప్రసాదరావు, అద్దంకి

అధఃపాతాళంలో..
గొప్ప దర్శకుడు కదా, బాగా తీస్తాడు అనుకుంటే బోలెడంత పబ్లిసిటీ దంచేసి తలా తోక లేని సినిమాను సుకుమార్ కుమారి అంటూ బయటపెట్టాడు. అంతకంటే -మన పురాతన సంస్కృతి సంప్రదాయాలను తుంగలోకితొక్కి ప్రేమ పేరిట పరమ చెత్త సినిమాను అందించాడు. దిగజారుతున్న తెలుగు సినిమా గొప్పతనాన్ని మరింత అధఃపాతాళానికి తొక్కేశాడు. కాసులు రాలడంకోసం స్ర్తిలను ఇంత అసభ్యంగా చిత్రీకరించాలా? కథానాయికి పాత్ర ఓ పరమచెత్త ప్రయోగం. కాబోయే భార్యకు శీలపరీక్ష ఏంటండి? దిక్కుమాలిన ఐడియాకాకపోతే? మహిళల పరువు ప్రతిష్టను దిగజార్చే విధంగా సినిమాను తెరకెక్కిస్తే సెన్సార్‌వారు ఏ సర్ట్ఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తెలుగు సినిమా ప్రేమికులకు బాధకలిగించిందీ చిత్రం. వెరైటీ, యూత్ చిత్రాల పేరిట భారతీయ సమాజంలో గొప్పగా చెప్పబడుతున్న స్ర్తి పురుష నైతిక బంధాన్ని ప్రేమనే గొప్ప భావాన్ని కించపరుస్తూ సినిమాలు తీయడం, వాటిని నియంత్రణా సంస్థలు ప్రోత్సహించడం బాధాకరం.
-ఎం కనకదుర్గ, తెనాలి

ఊకదంపుడు రాసి
ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో కథల నాణ్యత క్షీణించిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఓ దర్శకుడు తెలుగు రాష్ట్రంలో కథలకు కొరత లేదని తెలుసుకోలేకపోతున్నాడు. వైవిధ్యభరితంగా ఆలోచించి వినూత్న పంధాలో కథలను తయారుచేసే ఉద్ధండులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న నవలా రచయితలు, కథకులు అద్భుతమైన కథలను తయారుచేసే సత్తా ఉన్నవారు ఈమధ్య విడుదలైన చిత్రాలు కొన్ని ఆ విషయాన్ని నిరూపిస్తున్నాయి. తెలుగు కథను ఒక ఫార్మాట్‌లో బిగించి, చుట్టూ సన్నివేశాలను అల్లుకుంటూ మూస పద్ధతిలో సినిమాలు తీసే అగ్రదర్శకుల మైండ్ సెట్ మారాలి. కొత్తదనంకోసం తపించే ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు తీయాలి. సన్నివేశాలను అల్లుకుంటూ కథ పుట్టించే పరిస్థితి పోవాలి. చిరంజీవి 150 చిత్రానికి కథ కావాలంటూ అగ్రదర్శకులను సంప్రదిస్తున్నారు. టాలెంట్‌కోసం వెతికితే అద్భుతమైన కథలను అందించేవారు బోలెడుమంది ఉన్నారు. ఆ విషయం టాలీవుడ్‌కు తెలియడం లేదు.
-సి ప్రతాప్, శ్రీకాకుళం

సొంత డబ్బా
‘ఏదీ సినిమా దారి’ వ్యాసం పబ్లిసిటీ మోసాల్ని బహిర్గతం చేసింది. వింటున్నవారికి వివేకం ఉండదన్న ధీమాతో సినీ ప్రముఖులు అతిశయోక్తులు, అబద్ధాలు విసురుతుంటారు. వీక్షకులు నమ్మేస్తారని వారి భ్రమ. నా మనవడి మొదటి సినిమా అబ్బో బ్రహ్మాండం అంటూ నా పదో సినిమాని మించిపోయాడనే ఓ తాతగారు. మా అబ్బాయి డాన్సుల్లో మించిపోయాడనే ఓ సీనియర్ హీరో. కొత్తగా రంగంలోకి అడుగుపెట్టిన వారసులు తక్కువ తినలేదు. కలక్షన్లు దుమ్మురేపుతున్నాయని, మొదటిరోజే 5 కోట్లు వసూలు చేసిందని అంటాడు అర్భకుడు. ఇలా ప్రేక్షకుల్ని మోసంచేసి వారే బొక్కబోర్లా పడుతున్నారు.
-కృష్ణ, కొండయ్యపాలెం

అసహనం ఎందుకు?
బాలీవుడ్‌లో సూపర్‌స్టార్స్‌గా వెలుగొందుతున్న ముగ్గురు ఖాన్‌లలో అమీర్‌ఖాన్‌కి పర్ఫెక్షనిస్ట్ అనే పేరు, ఉత్తముడనే ప్రఖ్యాతి. ఐతే అతడే దేశంలో అసహనం పెరిగిపోతోందని టామ్‌టామ్ చేస్తున్నవారితో చేరి తన భార్య దేశం విడిచిపోదామని అంది అన్నారు. హిందువుల్ని కించపరిచే దృశ్యాలున్నాయని కొందరు విమర్శించినా కూడా పికె చిత్రాన్ని సూపర్‌హిట్ చేశారు.
తనను మెచ్చుకున్నవారిలోనే ఇప్పుడతనికి అసహనం కనిపిస్తోంది. రెండు నెలల క్రితం జరిగిన దుర్ఘటనల్లో నిందితుల్ని అరెస్టుచేశారు. తర్వాత దేశం ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు అమీర్ అసహనం గురించి మాట్లాడటం ఏమిటి? మరో దేశంలో ఇంత కీర్తి, డబ్బు సంపాదించగలిగేవాడా?
-సుధీర్, శ్రీనగరం

ఇష్టారాజ్యంగా..
ఈమధ్య తామరతంపరగా విడుదలవుతున్న సినిమాలు రాశి ఎక్కువై వాశి లేని సినిమాలౌతున్నాయి. బ్రూస్‌లీ లాంటి సినిమా శ్రీనువైట్ల సినిమాల్లో వుండే రియాల్టీ షోలతో ఫ్లాప్ కాగా అలనాటి సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో మారువేషాలుండేవి. అలాగే శ్రీనువైట్ల సినిమాలు రియాల్టీ షోలతో బాల్చీ తనే్నస్తున్నాయి. ఇక చిన్న చితకా సినిమాలు అలా వస్తూ ఇలా పోతున్నాయి.
ఊదరగొట్టిన అఖిల్ పత్తాలేకుండా పోయాడు. కథాకథనం పాత చింతకాయ పచ్చడి అవడంతో ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించాడంటే నమ్మలేం. ఇక చీకటి రాజ్యం సినిమా డాక్యుమెంటరీకి ఎక్కువలా తయారైంది. టికెట్ విషయానికి వస్తే థియేటర్లలో ప్రభుత్వం పెంచకున్నా తమ ఇష్టానుసారంగా టికెట్లను భారీ రేట్లకు అమ్ముకుంటున్నారు.
-శివలెంక చంద్రశేఖర్, మెహిదీపట్నం