జాతీయ వార్తలు

చిరుదీవిలా చెన్నై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తోంది * లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: భారీ వర్షాలు వరద తాకిడికి గురయిన చెన్నై నగరంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్తూ, ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని విధాలా సాయం అందిస్తుందని చెప్పారు. ‘చెన్నై నగరం నడిసంద్రంలో దీవిలాగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే నగరానికి అన్ని జాతీయ, రాష్ట్ర హైవేలతో సంబంధాలు తెగిపోయాయి’ అని తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ రాజ్‌నాథ్ చెప్పారు. సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనతో ఆయన ఏకీభవిస్తూ నగరం కొన్ని రోజులుగా గతంలో ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పారు. నగరంలో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసిందని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కేవలం 24 గంటల్లో నగరంలో 330 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందని, సాధారణంగా డిసెంబర్‌నెలంతా కురిసే 250 మిల్లీ మీటర్ల వర్షానికన్నా ఇది ఎక్కువ అని ఆయన చెప్పారు.
కుండపోత వర్షాలకు తమిళనాడులో 269 మంది చనిపోగా, పుదుచ్చేరిలో ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌లో 54 మంది మృతి చెందినట్లు రాజ్‌నాథ్ చెప్పారు. సహాయ పునరావాస చర్యల కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయం వివరాలను ఆయన తెలియజేస్తూ, సైన్యం, నేవీ, వైమానిక దళాలతో పాటుగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన 14 బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు. కేంద్ర సాయంగా రాష్ట్రం రూ.8,481 కోట్లు కోరగా, కేంద్రం తక్షణ సాయం కింద రూ 940.92 కోట్లు అందజేసిందని ఆయన చెప్పారు.
మరిన్ని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు
భారీ వర్షాలకు అతలాకుతలమైన చెన్నై నగరంలో సహాయ చర్యలకోసం తమ సిబ్బంది సంఖ్యను ఎన్‌డిఆర్‌ఎఫ్ రెట్టింపు చేసింది. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న 15 బృందాలకు తోడు అదనంగా మరో 15 బృందాలను అక్కడికి పంపించామని, ఇప్పటివరకు చెన్నైలో 5 వేల మందిని కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎన్‌డిఆర్‌ఎఫ్ గురువారం ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుతం 30 బృందాలు నగరంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని, ఒక్కో బృందంలో 40 మంది దాకా సిబ్బంది ఉన్నారని గురువారం హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి అధ్యక్షతన నార్త్‌బ్లాక్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఎన్‌డిఆర్‌ఎఫ్ చీఫ్ ఒపి సింగ్ చెప్పారు.