జాతీయ వార్తలు

స్పృహలోకి జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, అక్టోబర్ 21:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సందేహాలు క్రమంగా తొలగిపోతున్నాయి. గత నాలుగు వారాలుగా ఇక్కడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ దాదాపుగా స్పృహలోకి వచ్చారని, మంచంమీద కూర్చోగలుగుతున్నారని చెబుతున్నారు. అమె వచ్చిన వారిని ‘పలుకరించ’గలుగుతున్నారని, శారీరకంగా ఆమె కోలుకుంటున్నారని చెప్పడానికి ఇది కీలక సంకేతమని తాజాగా జారీ చేసిన బులిటెన్‌లో అపోలో ఆసుపత్రుల వైద్య సేవల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యభామ తెలిపారు. ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధికి చికిత్స పొందుతున్న జయ ఇంకొన్నాళ్లు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వెల్లడించారు. శ్వాస తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ట్యూబ్‌ను తొలగించినప్పుడే ఆమె మాట్లాడగలుగుతారని వివరించారు. జయ ఆరోగ్యం క్రమంగా మెరుగువుతున్నా ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉన్నామని తాజాగా జారీ చేసిన బులిటెన్‌లో అపోలో ఆసుపత్రి తెలిపింది.