రాష్ట్రీయం

చెర వీడింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్ నేతల విడుదల
హెచ్చరించి వదిలేసిన మావోయిస్టులు
కాళ్లావేళ్లాపడితే వదిలారు
విడుదలైన నేతల వివరణ

చర్ల, నవంబర్ 21: ఖమ్మం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలో ఈ నెల 18న కిడ్నాప్‌నకు గురైన తెరాస నేతలు ఎట్టకేలకు శనివారం విడుదల అయ్యారు. గులాబీ నేతలు ఆరుగురు క్షేమంగా తిరిగి రావడంతో తెరాస నాయకత్వం ఊపిరిపీల్చుకుంది. మావోయిస్టులతో ప్రభుత్వం తరఫున జరిపిన సంప్రదింపులు, చర్చలు ఫలించడంతో వారిని అన్నలు వదిలిపెట్టారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఏపి నారాయణ, రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌లతో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చి తొలి తప్పుగా, హెచ్చరికగా వీరిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తోడు భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మానె రామకృష్ణ భార్య లక్ష్మి నేరుగా విరసం నేత వరవరరావుతోనూ ఫోన్లో మాట్లాడి తన భర్త అమాయకుడని, విడిపించాలని వేడుకున్నారు. ప్రభుత్వం కూడా ప్రజా సంఘాల నేతల ద్వారా చర్చలు జరిపింది. కేవలం 16 నెలల కాలంలోనే రాష్ట్రంలో పేద ప్రజల కోసం మావోయిస్టు అజెండాను అమలు చేస్తున్నామనే నమ్మకాన్ని మావోయిస్టులకు కల్పించారు. దీనికి తోడు వరంగల్ జిల్లా మేడారంలో శ్రుతి, సాగర్ ఎన్‌కౌంటర్ దురదృష్టకరమని, ఇకపై అటువంటివేమీ ఉండవనే భరోసా వారికి ఇవ్వడంతో మావోయిస్టులు మెత్తపడ్డట్లు సమాచారం.
కిడ్నాప్ హైడ్రామాపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఈ నెల 18న డబుల్ బెడ్‌రూం ఇళ్ల గురించి పూసుగుప్ప వెళ్లామని భద్రాచలం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మానె రామకృష్ణ విడుదలైన అనంతరం మీడియాకు వివరించారు. అనుకోకుండా మావోయిస్టులకు చిక్కగా తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం వచ్చిందని మావోయిస్టు పార్టీ భావించి వారిని అడవుల్లోకి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే మేడారం ఎన్‌కౌంటర్‌కు బదులు తీర్చుకుంటామని, మీలో ఇద్దరిని చంపేస్తామని మావోయిస్టులు తమను బెదిరించారని, తాము కాళ్ల వేళ్లా పడి... చంపితే అందరినీ చంపండని, లేకుంటే వదిలేయాలని కోరినట్లు విడుదలైన నేతలు చెబుతున్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు వద్దని, ప్రజా సమస్యలు తీర్చాలని వారు డిమాండ్ చేశారని, అదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తమను హెచ్చరించినట్లు వారు పేర్కొంటున్నారు. సాధారణంగా వారు కిడ్నాప్ చేశాక తమ డిమాండ్లపై స్పష్టత వచ్చేంతవరకు వదలరు. కానీ వారిని కేవలం రెండు రోజుల్లోనే విడుదల చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
(చిత్రం) విలేఖర్లతో మాట్లాడుతున్న మానె రామకృష్ణ