లండన్‌లో రోబో-2.0 పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగా సినిమా తరువాత రజనీ చేస్తున్న చిత్రం ‘రోబో-2.0. ప్రస్తుతం తమిళనాటే కాక యావత్ సౌత్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రజనీ, శంకర్‌ల రోబో కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని దాదాపుల 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా లండన్‌లో నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ హెడ్ ఆఫీసు లండన్‌లోనే ఉంది. అందుకే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని అక్కడ నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారట నిర్మాత. కానీ ఎప్పుడూ అభిమానులకు పెద్ద పీట వేసే రజనీ తన అభిమానులకు దూరంగా ఎక్కడో లండన్‌లో ఆడియో కార్యక్రమాన్ని చేయటానికి ఒప్పుకుంటారా లేదా అనేదే తేలాల్సిన విషయం. ఇకపోతే ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రజనీ సరసన యామీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం 2017లో ప్రేక్షకుల ముందుకు రానుంది.