సిద్ధమవుతున్న దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరజ్‌శ్యామ్, నేహాసక్సెనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా యశస్విని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందించిన చిత్రం ‘దండు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, మల్టీ డైమన్షన్ వాసు సంయుక్తంగా విడుదల చేశారు. బిగ్ సీడీని శ్రీవాస్, ముప్పలనేని శివ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత ముంగమూరి శేషగిరిరావు మాట్లాడుతూ, కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని, కన్నడంలో విడుదలైన ఈ చిత్రం విజయవంతమైందని తెలిపారు. తెలుగులో కూడా విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని, పాటలన్నీ మంచి మంచి లొకేషన్లలో చిత్రీకరించామని, అన్నివర్గాల ప్రేక్షకులకు కావలసిన ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతోందని తెలిపారు. రెండున్న సంవత్సరాలుగా ఈ సినిమాకోసం కష్టపడ్డామని, 1970నుండి 96వరకు ఆదోనిలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించామని, కన్నడంలో విజయవంతమైనట్లుగానే తెలుగులో ప్రేక్షకులు ఆదరిస్తారని దర్శకుడు సంజీవ్ మేగోటి అన్నారు. ఈ సందర్భంగా సినిమాకోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. రాజ్ కందుకూరి, డి.ఎస్.రావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. దిశ, రఘుబాబు, తులసి, ఢిల్లీ రాజేశ్వరి, గౌతంరాజ్, శ్రీ్ధర్ పెద్ది, రాధాకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: హారిస్ ఎస్.ఎన్, ఫైట్స్: థ్రిల్లర్ మంజు, పాటలు: పోతుల రవికిరణ్, విగీనా రఫీ, ఎడిటింగ్: సర్వాణి శివకుమార్, నిర్మాత: మంగమూరి శేషగిరిరావు, సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి.