సరైనోడు పాటలు వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ కథానాయకుడిగా, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్స్‌ని అందించిన ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరైనోడు’. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను చేయనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేక గీతంలో అల్లుఅర్జున్‌తో కలిసి స్టెప్పులేసింది. నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిందని, అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో వస్తున్న ‘సరైనోడు’ చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతామని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాడని అన్నారు. ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సరైనోడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని, అల్లు అర్జున్‌ని సరికొత్తగా బోయపాటి ప్రెజెంట్ చేస్తున్నాడని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్టేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, రకుల్, కేథరిన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని, అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్‌లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు.