ఇదేదో బాగుందే చెలి అంటున్న చైతూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలెండెడ్ దర్శకులను పట్టుకోవడంలో చైతూ అందరికంటే ఓ మెట్టుపైనే ఉన్నాడు. చైతూ మంచి హిట్ పాటలలోని పదాలతో తన సినిమాలకు టైటిల్స్ పెట్టేసి ఈజీగా క్యాచీ టైటిల్స్ పట్టేస్తున్నాడు. తన మొదటి హిట్ ‘ఏ మాయ చేసావే’ కూడా ‘ఒక్కడు’ చిత్రంలోని ‘నువ్వేం మాయ చేసావో గాని..’ అనే పాట నుండి తీసుకున్నదే. ఆ తర్వాత ఆయన తన తాత నటించిన ‘రాముడు కాదు కృష్ణుడు’ చిత్రంలోని ‘ఒక లైలా కోసం’ను టైటిల్‌గా మార్చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం గౌతం మీనన్‌తో ఆయన చేస్తోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ కూడా ‘ఒక్కడు’ పాటలోనిదే. తాజాగా ఆయన రమేష్ వర్మతో ఓ చిత్రం చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ చిత్రంలో చైతూ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, పూజా హెగ్డే నటించనున్నారు. ఈ చిత్రానికి కూడా ‘ఇదేదో బాగుందే చెలి’ అనే టైటిల్‌ను పెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.