ఉగాదికి సర్దార్ గబ్బర్‌సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్, కాజల్ జంటగా బాబి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ఆడియో విడుదల నేడు హైదరాబాద్‌లో జరగనుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కథానాయకుడు పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుకను మొదట చేయాలని అనుకోలేదని, నిర్మాత శరద్‌మరార్ కోరికపై తప్పక చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు. ఈ వేడుకకోసం అనేక వేదికలను మొదట అనుకున్నా చివరికి హైటెక్ సిటీ వద్దనున్న నోవాటెల్ హోటల్‌లో జరపడానికి నిర్ణయించామని, అయితే పాస్ లేని అభిమానులు కార్యక్రమానికి రావద్దని ఆయన కోరుతున్నారు. అభిమానులకు ఏదైనా జరిగితే తనకు జరిగినట్టే భావిస్తానని, వారు ఇబ్బంది పడితే తాను ఇబ్బంది పడ్డట్టేనని ఆయన అన్నారు.
అభిమానుల రూపంలో అసాంఘిక శక్తులు ప్రవేశించి, అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఇందుకోసం పోలీసుల సహకారాన్ని తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంకోసం పోలీసు సహకారం అందిస్తున్న మంత్రి కె.టి.ఆర్, హరీష్‌రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అలాగే కమిషనర్ సి.వి.ఆనంద్, డిజిపి అనురాగ్‌శర్మలకు ఈ సందర్భంగా తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన వివరించారు. ఈ సినిమాలో తాను ‘ఇంద్ర’ చిత్రంలోని వీణ స్టెప్‌ను ప్రాక్టీస్ చేసి, వేశానని అది ఎలా వుందో అభిమానులు చెప్పాలని కోరారు. హిందీలో కూడా సినిమాను విడుదల చేస్తున్నామని, పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రం ఖమ్మం, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులలో జరిగే కథనంగా వుంటుందని అన్నారు. భవిష్యత్‌లో తాను సినిమాల్లో నటించనని కొన్ని వార్తా కథనాలు వచ్చాయని, వాటిపై తాను ఇప్పుడు ఏమీ స్పందించనని, సినిమాలతోపాటుగా రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా ఉండడానికి నిశ్చయించుకున్నానని తెలిపారు. త్వరలో ‘ఖుషీ-2’ చిత్రం, ఎస్.జె.ఎస్ సూర్య దర్శకత్వంలో రూపొందించనున్నామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, గబ్బర్‌సింగ్‌ను ఏప్రిల్ 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, నేడు జరిగే ఆడియో వేడుకకు పాస్ లేని అభిమానులు రావద్దని మరీమరీ తాను వేడుకుంటున్నానని ఆయన ముగించారు.