జాతీయ వార్తలు

చిదంబరాన్ని అరెస్టు చేసిన ఈడీ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఈరోజు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరాన్ని తీహార్ జైలులో విచారించారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదంబరం తీహార్ జైలులో ఉన్న విషయం విదితమే. విచారణ కోసం కార్తి చిదంబరం, నళిని చిదంబరం కూడా జైలుకు చేరుకున్నారు. కాగా ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు సోమవారంనాడు ఇరువైపుల వాదనలు విన్న తరువాత అవసరమైతే చిదంబరాన్ని అరెస్టు చేయవచ్చని కూడా ఆదేశించింది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి కాబట్టి ఈడీ అధికారులు జైలుకు వెళ్లి విచారణ జరపాల్సిందిగా సూచించింది. ఈ మేరకు ఈడీ అధికారులు తీహార్ జైలుకు వచ్చి విచారణ నిర్వహించారు. విచారణ ముగిసిన తరువాత చిదంబరాన్ని ఈడీ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు.