రాష్ట్రీయం

బాల కార్మికుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 28: బాల కార్మికుల కోసం అన్ని జిల్లాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్టు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాసనసభా కమిటీ చైర్‌పర్సన్ మీసాల గీత తెలిపారు. కమిటీ శుక్ర, శనివారాల్లో విశాఖ జిల్లాలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పర్యటించి అనేక అంశాలపై ఆరా తీసింది. శనివారం విశాఖ నగరంలో పర్యటన అనంతరం కమిటీ చైర్‌పర్సన్ మీసాల గీత తనను కలిసిన ఆంధ్రభూమి విలేఖరితో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గుడ్లు, పాలు ఆలస్యంగా అందడం వల్ల అవి పాడైపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిని సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బాల కార్మికుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్టు తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఆగటం లేదన్నారు. ఇలాంటి సందర్భాల్లో చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండేలా, బాల్య వివాహాలు చేసుకున్న బాల, బాలికల కోసం కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నామన్నారు. నగర పర్యటనలో భాగంగా వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కమిటీ ఆరా తీసింది. మహిళా, శిశు, వికలాంగులకు, వృద్ధుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను పరిశీలించింది. నగరంలోని జాలారిపేటలో వికలాంగుల వసతి గృహాన్ని సందర్శించినపుడు అక్కడ సరిపడా దుప్పట్లు లేవని విద్యార్థులు కమిటీ ఎదుట మొర పెట్టుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ దుప్పట్లు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డైట్, కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం చెల్లిస్తున్న సొమ్ము చాలడం లేదని తెలుపగా, మొత్తాన్ని పెంచాలంటూ ప్రతిపాదన పంపుతామన్నారు. సాగర్‌నగర్‌లోని ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ ఉపాధి శిక్షణ కోర్సులు ఏ విధంగా అమలు చేస్తున్నదీ చైర్‌పర్సన్ ఆరా తీశారు.