రంగారెడ్డి

బాల్య వివాహాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోమిన్‌పేట, మార్చి 14: సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాల నిర్మూలనకు, అన్ని మతాల పెద్దలు ఫంక్షన్ హాళ్ల యజమానులు, పురోహితుల సహకారం అందజేయాలని తహశీల్దార్ ఎ.విజయకుమారి అన్నారు.
సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రధానంగా పురోహితులు సహకరించాలన్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన వివాహ వయసు వధువు-18, వరుడు 21 ఏళ్లకంటే ముందే వివాహం చేయడంవల్ల శారీరకంగా గట్టిగా లేకపోవడంవల్ల పుట్టిన బిడ్డలు చనిపోవడం, కొనే్నళ్లకే భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం, పోలీసుస్టేషన్‌ల చుట్టూ తిరగడం వంటివి పెరగడంవల్ల తల్లిదండ్రులు కేవలం పెండ్లి చేస్తే తమ బాధ్యత తీరిపోతుందని అనుకుంటారని, పెళ్లి అయిన తర్వాత మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపిడిఓ శాంత, ఐసిడిఎస్ సిడిపిఓ కాంతారావు, చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటేష్‌గౌడ్, మండల కోఆర్డినేటర్ యాదయ్య, పంక్షన్ హాల్స్ యజమానులు ఆయా మతాల పూజారులు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.