రాష్ట్రీయం

రైతుల ఆత్మహత్యల ప్రస్తావనేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో టిఆర్‌ఎస్ సర్కారును నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి

హైదరాబాద్, మార్చి 12: ‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం మీకు బ్రహ్మాండంగా ఓట్లు వేయిస్తోంది. ఐడిహెచ్ కాలనీలో కట్టిన ఇళ్లను చూపించి మీరు రాష్టమ్రంతటా ఓట్లు వేయించుకుంటున్నారు. మా హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తారా? అనే సందేహం ఉంది’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించారు. 12వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదని విమర్శించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ తరఫున చిన్నారెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గత రెండు బడ్జెట్‌లలో వెయ్యేసి కోట్ల రూపాయలు కేటాయించినట్టు చూపించారు కానీ ఎక్కడా ఖర్చు చేయలేదని అన్నారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ఎప్పటి లోగా వీటిని అమలు చేస్తారో గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా పేర్కొనలేదని విమర్శించారు. తెలంగాణలో కరవు విలయతాండవం చేస్తోంది గవర్నర్ ప్రసంగంలో దాని ప్రస్తావనే లేదని అన్నారు. కెజి టూ పీజి ఉచిత విద్య ఎన్నికల ముందు ఇచ్చిన ప్రధాన హామీ అని గవర్నర్ దాని గురించి ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థులు వీరోచితంగా ఉద్యమించారు, విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ చెల్లించడం లేదని తెలిపారు. చిన్న జిల్లాల వల్ల ప్రయోజనం కలుగుతుందని 10 జిల్లాల తెలంగాణను 24 జిల్లాలుగా మార్చనున్నట్టు టిఆర్‌ఎస్ ప్రకటించినా, ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. యుపిఏ ప్రభుత్వం ఐటిఐఆర్ ప్రాజెక్టును ప్రకటించింది, ఆ ప్రాజెక్టుకు సంబంధించి పురోగతి ఏమిటో ప్రస్తావించలేదని తెలిపారు.