రాష్ట్రీయం

చింటూ ఇంట్లో మారణాయుధాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, నవంబర్ 21: చిత్తూరు నగర మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ ఇంట్లో పోలీసులు కొన్ని మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు పరిశోధనలో భాగంగా చిత్తూరు పోలీసులు బాంబుస్క్వాడ్‌తో కలిసి శనివారం రాత్రి నగరంలోని గంగనపల్లెలో ఉన్న చింటూ ఇంట్లో చింటు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం నాయుడు, సక్కుబాయిల సమక్షంలో ప్రత్యేక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రెండు పెద్ద కత్తులు, రెండు చురకత్తులతోపాటు 20కి పైగా వెదురు కర్రలు లభ్యమయ్యాయి. వీటితోపాటు చింటూకు సంబంధించిన కొన్ని బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇంటి పత్రాలు, అడంగళ్, చెక్‌బుక్కులు లభ్యమైయ్యాయి. కాగా ఈ తనిఖీల్లో చిత్తూరు టూటౌన్ సిఐ సూర్యమోహన్‌రావు, తాలుకా సిఐ చంద్రశేఖర్, టూటౌన్ ఎస్సై సుబ్బారెడ్డి, బాంబుస్క్వాడ్ సిబ్బంది, సివిల్ పోలీసులు పాల్గొన్నారు.