అక్షర

మేధస్సుకు పదునుపెట్టే సైన్స్ నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండి గుట్ట-బంగారు పుట్ట
వెల: రూ,50/-
ప్రతులకు: చినుకు పబ్లికేషన్స్,
26-7-11, గరికపల్లి వారి వీధి,
గాంధీనగర్, విజయవాడ-520003

ఇదొక చక్కటి డిటెక్టివ్ నవల. పిల్లలు లక్ష దీవులకేసి బోటులో వెళ్లడం, అక్కడున్న వెండి గుట్టని చూడడం, అక్కడికి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో వున్న సులేమాన్ అనే వ్యక్తిని వీరు గుర్తించి భద్రంగా ఆసుపత్రికి చేర్పేంచే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో అనేక విషయాలు, ఆఫ్రికానుంచి వచ్చిన విషపుచీమలు ఎక్కడివి? మన దేశానికి ఎలా వచ్చాయి? వాటి తాలూకు పరిశోధనలు..ఇలా చాలా వివరాలతో చక్కటి సైంటిఫిక్ పిల్లల నవల రచించారు త్రిమూర్తి. వీరి అసలు పేరు ఎ.ఐ.రామమూర్తి. సైన్సు విషయాలు పిల్లలకి ఎలా చెప్పాలో తన తండ్రిగారు అవధానుల సన్యాసిరావు నుండి తెలుసుకున్న వీరు, రేడియోకి ఎన్నో సైన్స్, నాటికలు రాశారు. వెండిగుట్ట, బంగారు పుట్ట సైన్స్ నవల, ఆసాంతం ఉత్కంఠ భరితంగా చదివించే సైన్సునవల. అడుగడుగునా ఆతురతతో, ఆందోళనతో, ఆనందంతో పిల్లలని చదివించే విజ్ఞానదాయకమైన నవల. దీనిలో పిల్లల సామర్ధ్యాన్ని తక్కువగా వెలకట్టలేమని తెలుస్తుంది. *

చిన్నారులకు సంబరం..

‘ఉనిమా’
వెల: రూ50/-.
దొరుకు స్థలం: చినుకు పబ్లికేషన్స్, 26-7-11, గరికపాటివారి వీధి, గాంధీనగర్,
విజయవాడ- 520 003

‘ఉనిమా’ లోకంలో అనే పి.ఎస్.ఎన్.ఎన్.మూర్తి రచించిన పిల్లల నవల మంచి సైన్స్ ఫిక్షన్. కంప్యూటర్ ఫిక్షన్. కంప్యూటర్ చేసే పనులు, పిల్లలకే కాదు పెద్దలకీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పిల్లలకైతే బోలెడంత సంబరం, ఉత్సాహాన్ని ఇస్తుంది. సరదాగా సాగుతుందీ కథనం. తెలుగులో కంప్యూటర్ చొరబాట్ల గురించి వివరించే పిల్లల కథలు, నవలలు అరుదు. ఈ అరుదైన సైన్స్‌ని చక్కగా పిల్లలకి అందించారు ఈ నవల ద్వారా మూర్తిగారు. సైన్స్ విజ్ఞానం విరివిగా, విధిగా, వడివడిగా వృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ఈ నవల పిల్లలకే విజ్ఞాన నిధి అంటే అతిశయోక్తి కాదు. ప్రతి పాపాయి చదవాలీ నవల. తమ కోసమే ప్రత్యేకించి రాసిన చక్కటి విజ్ఞానాన్ని అందించే నవల.

-శారదా అశోక్‌వర్ధన్