Others

అవసరమా బాసూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150వ చిత్రం -పరిశ్రమలో ఉత్కంఠ రేపుతోంది. స్వయంకృషితో మాస్ హీరోగా ఎదిగిన స్టార్. ఫైట్లు పాటలతో అభిమానగణాన్ని సంపాదించుకున్న మెగా. రెండూ కలగలిపి -పెట్టుకున్నదో, సంపాదించుకున్నదో మొత్తానికి ‘మెగా స్టార్’ అయ్యాడు. సామాజిక సేవతో ‘పద్మాన్నీ’ అందుకున్నాడు. ఎదగడానికి ఇనే్నళ్లు కష్టపడిన చిరంజీవి -ప్రజారాజ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో పూర్తిగా చతికిలపడిన సంగతి తెలిసిందే. ‘నాకు గంజి తెలుసు.. బెంజి తెలుసు’ లాంటి పొలిటికల్ డైలాగ్‌లకు మోగినన్ని చప్పట్లు, పోలింగ్ టైంలో మోగకపోవడంతో అంచనాలు తలకిందులయ్యాయి. దాంతో -ప్రచారం టైంలో కాంగ్రెస్‌ను సముద్రంలోకి విసిరేస్తానన్న చిరంజీవి, ఎన్నికల అనంతరం కాలం కలిసిరాకపోవడంతో కాంగ్రెస్ మహా సముద్రంలోకి ప్రజారాజ్యాన్ని విసిరేశారు. ముఖానికి రంగువేసుకున్నంత సులువుగా రాజకీయం వేసుకోలేమన్న విషయం అర్థమైన తరువాత -చాలా గ్యాప్‌తో మళ్లీ తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు చిరంజీవి. ఇదీ క్లుప్తంగా చిరంజీవి కథ.
149 చిత్రాల ఎదుగుదలలో ఎన్నో ఆటు పోట్లు చూడటం వేరు. 150వ చిత్రానికి పడుతున్న పురుటి నొప్పులు వేరు. కొనే్నళ్ల కష్టంతో విజయాన్ని, కొద్దికాలం వైఫల్యాలతో పరాజయాన్ని చవిచూసిన చిరు -ఆరుపదులు దాటిన వయసులో మళ్లీ తెరపైకి రావడం వర్కవుటయ్యే వ్యవహారమేనా? అన్నదే ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయంశమవుతుంది. ఇన్నింగ్స్‌కు ముందు వార్మప్ అన్నట్టు -రామ్‌చరణ్‌తో కలిసి కనిపించిన చిత్రం బ్రూస్‌లీ. ఆ సినిమా ఆశించినంత బూస్ట్ అందించలేదన్నది నిజం. మునుపటిలా ఫైట్లు, స్టెప్పులకు వయసుమీరిన శరీరం ఎంతవరకు సహకరిస్తుందన్నదే ప్రశ్నార్థకం. ఈ డౌట్లు బ్రూస్‌లీ చిత్రంలో నాలుగైదు నిమిషాల నిడివి పాత్రను చూసిన తరువాతే మొలకెత్తడం మరో విషయం. స్టయిల్‌గా హెలీకాఫ్టర్‌లో దిగి, విలన్ గ్యాంగును రఫ్పాడించిన చిరంజీవిలో -మునుపటి ‘హీరోచితం’ కనిపించలేదన్న అపవాదు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు 150వ మైలురాయి దాటే స్పెషల్ సినిమాలో -బరువు పెరిగిన మెగాను భుజాలపై మోయాలంటే అది కచ్చితంగా టాలీవుడ్ చరిత్రను తిరగరాసేంత గొప్ప సినిమా అయివుండాలి. కొత్త చిత్రం -పాత రికార్డుల స్థాయిని దాటాలి. కుర్ర హీరోలను మైమరిపించేంత కొత్త రికార్డులు సృష్టించగలగాలి. ఇన్ని టాస్క్‌లను దాటాలంటే చిరు చేయబోయే చిత్రానికి -‘కత్తి’లాంటి కథ సరిపోతుందా? కథా వస్తువు అంతకంటే ఎక్కువైనదీ, ఇంతవరకూ టాలీవుడ్ టచ్ చేయనటువంటి వైవిధ్యమైనదీ అయివుండాలా? అన్న చర్చలూ లేకపోలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వంద చిత్రాలు రూపుదిద్దుకుంటే -90 చిత్రాల అడ్రస్ గల్లంతవుతోన్న పరిస్థితి. మిగతా పదిలో నాలుగైదు యావరేజ్ అంటే, రెండు మూడు హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. అదీ -లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ (ఓవర్సీస్) కలెక్షన్లు కలుపుకుని చెప్పుకుంటే. ప్లాపులతో కాపురం చేస్తున్న టాలీవుడ్ టైంలో చిరు చిత్రం గత రికార్డుల రేంజ్‌కు చేరాలంటే చాలా చాలా చాలా టాస్క్‌లనే ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ సామర్థ్యాన్ని చిరు ప్రదర్శించగలరా? అన్నదీ అభిమానులను తొలిచేస్తున్న సందేహమే.
ఒకప్పుడు -తెరపై చిరు కనిపించగానే ఈలలేసి, చప్పట్లుకొట్టిన మాస్ అభిమానులూ చిరుతోపాటే వయసుమళ్లి ‘లైఫ్ లైన్’లోకి వచ్చేశారు. అమితంగా ఇష్టపడే మరికొందరు చిరు బ్రాండ్‌నేమ్‌తో సాఫిస్టికేటెడ్ సామాజిక కార్యక్రమాల్లోకి ఒదిగిపోయారు. అప్పుడు వినిపించిన ఈలలు, చప్పట్లు.. ఇప్పుడు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కలగలిపి వినిపించినా ఆడియన్స్‌లో అంత ఉత్సాహం, ఉరకలు తీసుకురావడం కష్టమేనన్నది మెగా పాయింట్. మరోసారి తెరపైకి వచ్చి రికార్డు తిరగరాయాలన్న చిరు ఆలోచన, లక్ష్యం కరెక్టే కావొచ్చు. కాకపోతే -‘వీక్ డేస్’ స్టామినాకంటే వీక్ అయిపోయిన ప్రస్తుత తెలుగు సినిమా ప్రపంచంలో రికార్డుల లక్ష్యం సాధించడానికి అనువైన సమయమేనా? అన్న సందేహాలూ ముసురుతున్నాయి. చక్కని కుటుంబ కథను ఎంచుకుని, సెంటిమెంట్ లేదా సందేశం కూడిన చిత్రాన్ని నిర్మించినా -నిజమైన సక్సెస్ టూర్ నిర్వహించే అవకాశం యూనిట్‌కు ఉంటుందా? అన్న సందేహాలూ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
ఆరు పదులు దాటినా అరవీర భయంకర పోరాట సన్నివేశాల్లో కనిపించే హాలీవుడ్ హీరోల రేంజ్ వేరు. ఏడుపదులు దాటినా హీరో ఇమేజ్‌ని డామినేట్ చేస్తూ నటనను ప్రదర్శించే బిగ్ బిలాంటి బాలీవుడ్ స్టార్ల తీరు వేరు. కానీ, పరిమితమైన తెలుగు సినిమా స్క్రీన్‌పై అలాంటి పరాక్రమాలను ఊహించుకోవడం నిజానికి చాలా కష్టం. ప్రచారంలో ఎంత ఊపు తీసుకొచ్చినా -విడుదలైన సినిమాలన్నీ వారం తిరక్కుండా బాక్సాఫీస్ నుంచి వరుస కట్టేస్తోన్న అనుభవాలతో ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్లకు దూరమైపోయారు. రెండు కోట్ల సినిమాకు నాలుగు కోట్ల ప్రమోషన్ చేస్తున్నా -ట్రైలర్‌ను చూసి సినిమా స్టేటస్‌ను లెక్కలేసి మరీ చెప్పే స్థాయికి ఎదిగిపోయారు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి 150వ చిత్రం నిజానికి -‘కత్తి’మీద సామే. రికార్డు టార్గెట్ కోసం -ఏళ్ల తరబడి సాధించుకున్న స్క్రీన్ ఇమేజ్‌ను చిరంజీవి పందెం ఒడ్డి ఆడుతున్నారా? అనిపిస్తోందని అభిమానులు కలత చెందుతున్నారు. ఎవరు ఔనన్నా కాదన్నా -చిరంజీవి నేమ్‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. నటనలో ఎత్తుల్ని, రాజకీయంలో లోయల్ని చవిచూసిన చిరంజీవి -సీనియర్ స్టార్‌గా సామాజిక సేవకు పరిమితంకాకుండా -150వ సినిమాతో జూదం అవసరమా? అన్న వాదనను అభిమానగణం బలంగా వినిపిస్తున్నారు.

-మురహరి ఆనందరావు