జాతీయ వార్తలు

నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలకు చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జాతీయ స్థాయిలో అథారిటీ: జైట్లీ
న్యూఢిల్లీ, మార్చి 11: దేశ వ్యాప్తంగా 164 పోంజీ కంపెనీల లావాదేవీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. వివిధ రకాల పథకాలతో ప్రజలను ముంచేసిన నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐఓ) దర్యాప్తు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. నకిలీ చిట్‌ఫండ్ కంపెనీలకు అడ్డుకట్టవేయడానికి జాతీయ స్థాయిలో ఓ అథారిటీ ఏర్పాటు చేసే యోచన ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పోంజీ(నకిలీ) కంపెనీల జాబితా, దర్యాప్తు వివరాలు తెలిపారు. కార్పొరేట్ మోసాలకు అడ్డుకట్టవేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని జైట్లీ స్పష్టం చేశారు. మదుపరుల ప్రయోజనాలు కాపాడేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని ఆయన అన్నారు. కంపెనీ చట్టం 2013 కింద అవకతవకలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జైట్లీ చెప్పారు. పోంజీ కంపెనీల కేసుల పరిష్కారానికి కొన్ని రాష్ట్రాలు చట్టాలు రూపొందించుకున్నాయన్న మంత్రి‘సెబీ, ఎస్‌ఎఫ్‌ఐఓలు కూడా మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాయి’అని చెప్పారు. ఇప్పటికే అనేక నకిలీ కంపెనీలపై దర్యాప్తు చేపట్టిన సిబిఐ నిందితులను అరెస్టు చేయడం, పరువురిని జైళ్లకు పంపడం జరిగిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నకిలీ చిట్స్ కంపెనీల ఆస్తులను స్వాధీనం చేసుకుందని అన్నారు. నకిలీ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు జాతీయ అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు జైట్లీ వివరించారు.