నిజాయితీగా చెప్పిన కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షిత్, నక్షత్ర జోడీగా కరుణకుమార్ దర్శకత్వంలో
తెరకెక్కిన చిత్రం -పలాస 1978. నిర్మాత ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 6న విడుదలవుతోంది.
ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు కరుణకుమార్
మీడియాకు చిత్ర విశేషాలు వెల్లడించారు.
* కథలు రాయడం అలవాటయ్యాక స్వచ్ఛ్భారత్‌కు నేను రాసిన చెంబుకు మూడింది లఘు చిత్రం జాతీయస్థాయిలో రెండో బహుమతి సాధించటం జీవితంలో మర్చిపోలేని విషయం. అలా మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ సంక్షేమ ప్రకటనలు చేశాను. సినిమాలకు వచ్చే ఉద్దేశంతో కొన్ని కథలు రాసుకున్నా. పలాస 1978 మొదటి సినిమా అవుతుందని అనుకోలేదు.
* 1978లో శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కథాంశాన్ని రూపొందించాను. నాకున్న పరిచయంతో తమ్మారెడ్డి భరద్వాజ్‌కు చెప్పినపుడు ఆయనకు నచ్చి ‘సినిమా చేస్తున్నాం’ అన్నారు. నిర్మాత ప్రసాద్‌ను పరిచయం చేశారు. ఆయనకు కథ నచ్చటంతో వర్క్‌షాప్స్ నిర్వహించి ప్రీ ప్రొడక్షన్‌తో సినిమా ప్రారంభించాం.
* పాత్రలు ప్రత్యేక ముద్ర వేసుకుంటాయి. పాత్రలన్నీ సినిమాటిక్‌గా కాకుండా కంటెంట్ బేస్డ్‌గా ఉంటాయి. సినిమా ఎంత సీరియస్‌గా సాగుతుందో మాటల్లోనే అర్థమవుతుంది. కథ లోతుగా, సీరియస్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది. పాత్రల పేర్లు, వేష భాషలు సహజంగా ఉంటాయి. ఆడియన్స్‌కి బాగా గుర్తుండిపోతాయి.
* ఇదివరకు ఎవరూ చెప్పని కథ అంటూ మొదలైన యానిమేటెడ్ బుక్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ఆసక్తిగా ఉంటుంది. ఉత్తరాంధ్ర జానపదం నుంచి తీసుకున్న పాటలకు విశేష స్పందన వస్తుంది. కథానేపథ్యంగా మేము ఎంపిక చేసుకున్న లొకేషన్లు ఇంతవరకూ తెలుగు తెరపై రానివే. ఇదొక వ్యక్తి కథో, కుటుంబ కథో కాదు. ఒక సమూహం కథ.
* ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అందరినీ అలరించేలా నిజాయితీగా ఈ కథను ఆవిష్కరించాను. ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు చూసి మంచి ప్రశంసలు అందించారు.
* సెన్సార్ కట్స్ ఎక్కువ సూచించటంతో రివైజ్ కమిటీకి వెళ్లాం. అక్కడ చూసి వారు ప్రశంసించారు. ఈ సినిమా భిన్నమైనదని చెప్పగలను. రచయిత నుంచి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు. సినిమాను విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు.