ప్లాటినమ్ వేడుకలో ఎఫైర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరాజన్, ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రలుగా శ్రీరాజన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం -ఎఫైర్. చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. నిర్మాత తుమ్మలాపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ చిత్రం మొత్తాన్ని దర్శకుడు శ్రీరాజన్ తానై రూపొందించాడన్నారు. ఎఫైర్‌తో శ్రీరాజన్ పెద్ద దర్శకుల జాబితాలోకి వెళ్తాడని, హీరోయిన్లు ఇద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారన్నారు. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ కష్టపడి పని చేశారని, అయితే, అనుకున్న సమయానికి ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నందున ఎఫైర్ విడుదలను వాయిదా వేశామన్నారు. నవంబర్ 27న సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దర్శకుడు శ్రీరాజన్ మాట్లాడుతూ తెరకెక్కించేందుకు పడిన కష్టం అవుట్‌పుట్‌లో బాగా కనిపిస్తోందన్నారు. నన్ను నమ్మి సినిమా బాధ్యత అప్పగించిన నిర్మాత తుమ్మలాపల్లికి ధన్యవాదాలు తెలిపారు. కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కంచడం చాలా కష్టం. అలాంటిది కాంట్రవర్సి ఉన్న సబ్జెక్టు తీసుకొని డేర్ చేసి సినిమా చేశారు. పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి కథతో సినిమాలు రాలేదు. వైవిద్యమైన కధ, పాటలు బావున్నాయి. సినిమా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా అన్నారు.
కార్యక్రమంలో సిరాశ్రీ, గీతాంజలి, కర్ణ తదితరులు పాల్గొన్నారు.