నిఖిలే పెద్ద కంటెంట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉదయనందనవనమ్ దర్శకత్వంలో ఎంవివి సత్యనారాయణ రూపొందించిన ‘శంకరాభరణం’ చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్‌ను హైదరాబాద్‌లో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. నిఖిల్, నందిత జంటగా వస్తున్న చిత్రం గురించి నాగచైతన్య మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసినపుడే కొత్తగా ఉందనిపించిందని, నిఖిల్ సినిమా విడుదలవుతుందంటే ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళల్లో తానూ ఒకడినని అన్నారు. నిఖిల్ చిత్రాల్లో మంచి కంటెంట్ ఉండేలా కథలను ఎంచుకుంటాడని, కోన వెంకట్ కథ కథనాలు సినిమాకు హైలెట్‌గా ఉంటాయన్నారు. తప్పక ఓ బెంచ్ మార్క్ చిత్రంగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. సినిమా అంతా ఓ నవ్వుల పండగలా పిల్లలూ పెద్దవాళ్ళు అందరూ కలిసి చూసేలా ఉంటుందని, వచ్చే నెల 4న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు హీరో నిఖిల్ చెప్పారు. సినిమాకు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేస్తున్నపుడు ఇలా ఓ థీమ్ సాంగ్ చేయాలన్న ఆలోచన వచ్చిందని, కీలకమైన సన్నివేశంలో ఈ పాట వస్తుందని కోన వెంకట్ అన్నారు. సినిమా పేరును ప్రకటించగానే చాలామంది పాజిటివ్‌గా స్పందించారని, బాలీవుడ్‌కు ధీటుగా మనం చిత్రాలు తీయగలమని ఈ సినిమా నిరూపిస్తుందని కోన వెంకట్ అన్నారు.
కార్యక్రమంలో దర్శకుడు ఉదయ నందనవనమ్, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, పాటల రచయిత శ్రీజో, ఎడిటర్ చోటా కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.