సర్‌ప్రైజ్ చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కణితన్‌కు ఏమాత్రం తీసిపోని ఫీల్ ఇస్తుంది -అర్జున్ సురవరం సినిమా అంటున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. తమిళ హిట్టు సినిమా కణితన్‌కు రీమేక్‌గా వస్తున్న అ.సు -నవంబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. అనేక కారణాలతో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన సినిమాకు -రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో చిత్రబృందం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నిఖిల్ పాత్రికేయుడి పాత్ర పోషిస్తున్నాడు. నిఖిల్‌తో లావణ్య త్రిపాఠీ జోడీకట్టింది. మూవీ డైనమిక్ ఎల్‌ఎల్‌పీ, ఔరా సినిమా ప్రై లిమిటెడ్ బ్యానర్లపై రాజ్‌కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సినిమాను నిర్మించారు బి మధు సమర్పిస్తున్నారు. శ్యామ్ సిఎస్ సంగీతం సమకూర్చాడు. సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ కావడంతో -నెటిజన్లు నిఖిల్‌ను ప్రశ్నలు సంధిస్తున్నారు. ‘తమిళంలో కణితన్ మంచి కంటెంట్‌తో వచ్చింది. రీమేక్ కనుక తెలుగుకీ ఆ కంటెంట్ కనెక్టవ్వడం ఖాయం. మీ సినిమా హిట్టవుతుంది’ అన్న ఓ అభిమాని ప్రశ్నకి ‘కచ్చితంగా మీ అంచనాలకు రీచ్ అవుతా’ అంటూ ఆన్సరిచ్చాడు నిఖిల్. ‘ఒరిజినల్ బావుంది సరే, మరి రీమేక్ సంగతి’ అన్న మరో అభిమాని ప్రశ్నకి ‘ఒక నిర్ణయానికి ముందే వచ్చేయకుండా సినిమా చూడండి. కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు’ అంటూ అన్సరిచ్చాడు. మొత్తానికి సినిమా లేటైనా.. లేటెస్ట్ సక్సెస్ దక్కడం ఖాయమన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్.