మంచి సందేశమిచ్చే బిచ్చగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ‘పిచ్చైకారన్’ చిత్రాన్ని తెలుగులో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా పతాకంపై చదలవాడ పద్మావతి అనువదిస్తున్నారు. విజయ్ ఆంటోని, సత్య టైటస్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయసుధ ఆడియోను విడుదల చేసి తొలి కాపీని విజయ్ ఆంటోనికి అందజేశారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ, ఓ మంచి సందేశం వున్న సినిమాగా ఈ చిత్రం ట్రైలర్ చూశాక అర్థమైందని, తమిళంలో తాను ఈ చిత్రం చూడలేదని, తన సుపుత్రుడు తమిళంలో చాలా బాగుందని, ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ సినిమాలో పండిందని చెప్పాడని ఆమె తెలిపారు. విజయ్ ఆంటోని సంగీత దర్శకుడిగానే తనకు తెలుసునని, హీరోగా మారి చిత్రాలు చేయడం కొత్త విషయమని ఆమె అన్నారు. పిల్లలకోసం తల్లి ఎన్నో చేస్తుందని, అలాగే తల్లికోసం పిల్లలు ఏం చేశారనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని, తల్లిని కాపాడుకునేందుకు మిలియనీర్ అయిన కొడుకు ఏంచేశాడని, చావుబ్రతుకుల్లో వున్న తల్లిని ఎలా బ్రతికించుకున్నాడు అనేదే ఈ సినిమాలో ప్రధాన కథనమని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల కోసం కొత్తదనం పరిచయం చేయాలని ఈ సినిమాను అనువదించామని నిర్మాత చదలవాడ పద్మావతి తెలిపారు. ఓ వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగువారికి నచ్చుతుందని దర్శకుడు శశి తెలిపారు. కార్యక్రమంలో చదలవాడ శ్రీనివాసరావు, అల్లాణి శ్రీ్ధర్, ప్రసన్నకుమార్, కె.అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.