చిరు పక్కన సెకెండెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దంనాటి కలను సైరాతో తీర్చుకున్న చిరంజీవి -తదుపరి ప్రాజెక్టుకు సమాయత్తమవుతున్నాడు. కొరటాల శివ సిద్ధం చేసిన స్క్రిప్ట్‌తో వచ్చే జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహాద్రి అప్పన్న బ్యాక్‌డ్రాప్‌గా పెట్టి కొరటాల సిద్ధం చేసిన స్క్రిప్ట్‌లో చిరంజీవి పవర్‌ఫుల్ సోషల్ మెసేజ్ ఇవ్వనున్నాడన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. లాంఛనంగా మొదలైన ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్ వేగంగా సాగుతున్నాయి. స్టాలిన్ తరువాత మరోసారి తనపక్కన త్రిషకు అవకాశమిస్తోన్న చిరంజీవి, సెకెండ్ హీరోయిన్‌ను ఎంపిక చేయాల్సి ఉందట.
అయితే త్రిష ఎంపికపై అధికారిక ప్రకటనైతే వెలువడలేదు. త్రిషను ఫ్లాష్‌బ్యాక్ స్టోరీకి పరిమితం చేస్తే -కమర్షియల్‌గా సినిమాకు బ్యూటీనిచ్చే మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడంపై కొరటాల టీం దృష్టిపెట్టిందని అంటున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్, మ్యాటినీ నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు.